iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ మూవీ ఇప్పట్లో లేనట్లేనా ! మరోసారి పోస్ట్ పోన్ ?

  • Published Oct 08, 2024 | 1:35 PM Updated Updated Oct 08, 2024 | 1:35 PM

Game Changer Movie Release Update: ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ హిట్ కొట్టేశాడు. ఇక చరణ్ మాత్రమే ఏం చేస్తాడో చూడాలి. అది కూడా మరో రెండు నెలల్లో తెలిసిపోతుంది. అనుకుంటే పొరపాటే ఎందుకంటే గేమ్ చెంజర్ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అనే టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటో చూసేద్దాం.

Game Changer Movie Release Update: ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ హిట్ కొట్టేశాడు. ఇక చరణ్ మాత్రమే ఏం చేస్తాడో చూడాలి. అది కూడా మరో రెండు నెలల్లో తెలిసిపోతుంది. అనుకుంటే పొరపాటే ఎందుకంటే గేమ్ చెంజర్ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అనే టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటో చూసేద్దాం.

  • Published Oct 08, 2024 | 1:35 PMUpdated Oct 08, 2024 | 1:35 PM
గేమ్ ఛేంజర్ మూవీ ఇప్పట్లో లేనట్లేనా ! మరోసారి పోస్ట్ పోన్ ?

గేమ్ ఛేంజర్ మళ్లీ వెనక్కి! చరణ్ మూవీ ఇప్పట్లో లేనట్లేనా?.. ఫ్యాన్స్ కోరిక తీరినట్లే.. గేమ్ ఛేంజర్ నుంచి వరుస అప్డేట్స్ ఇవే? .. గేమ్ ఛేంజర్ కి కొత్త టెన్షన్! నిరాశలో ఫ్యాన్స్.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్? ఇలా ఒకటా రెండా ఇప్పటికీ పదుల సంఖ్యలో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ పై అప్డేట్స్ వచ్చాయి. ఫైనల్ గా అయితే డిసెంబర్ 20న లేదా క్రిస్మస్ కు గేమ్ ఛేంజర్ వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. మేకర్స్ కూడా దాని కోసం హడావిడిగా పనులు చేస్తున్నారట. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ హిట్ కొట్టేశాడు. రాజమౌళి మిత్ బ్రేక్ చేశాడు. ఇక చరణ్ కూడా గేమ్ ఛేంజర్ తో హిట్ కొట్టేస్తే ఈ మిత్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోంది. ఇంకెంత మరో రెండు నెలల్లో ఇది కూడా తెలిసిపోతుంది. అని ఇలా అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అభిమానులు మరోసారి నిరాశ చెందక తప్పదేమో అనిపిస్తుంది.

ప్రముఖ దర్శకుడు శంకర్ – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ మూవీ వస్తుంది. ఈ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. లేక లేక గేమ్ ఛేంజర్ మూవీ అప్డేట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా దీనిని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అంతలోనే అదిరిపోయే ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా మీద మెగా అభిమానులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో.. అంతే భయంగా కూడా ఉన్నారు. వారి భయానికి తగినట్లే అటు మేకర్స్ కూడా అప్డేట్స్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు అభిమానులు మరోసారి నిరాశ చెందక తప్పదు. దసరాకు గేమ్ ఛేంజర్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రివీల్ చేస్తామని చెప్పారు మేకర్స్. దానిని పోస్ట్ పోన్ చేస్తున్నారేమో.. ఈ పోస్ట్ పోన్ లు అలవాటే కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది అప్డేట్ పోస్ట్ పోన్ గురించి కాదు. మూవీ రిలీజ్ డేట్ గురించి. గేమ్ ఛేంజర్ మూవీ డిసెంబర్ 20 లేదా క్రిస్మస్ ఈ రెండు డేట్స్ లో రావడం లేదని.. 2025 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.

దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. అలాగే ఈ పండక్కి పోస్టర్ రివీల్ చేస్తాం .. ఆ పండక్కి గ్లిమ్ప్స్ రివీల్ చేస్తాం అన్న అప్డేట్స్  ఇన్ టైమ్ లో రావడం లేదని. ఇక వారు చెప్పిన రిలీజ్ డేట్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ గ్యాప్ లో పెండింగ్ పనులు అయ్యేలా కనిపించడం లేదని.. అందుకే మూవీ పోస్ట్ పోన్ చేస్తారనే టాక్ నడుస్తుంది . అటు దర్శకుడి నుంచైతే ఇంతవరకు ఏ అనౌన్సుమెంట్ లేదు. దీనితో గేమ్ ఛేంజర్ విషయంలో ఫ్యాన్స్ కాస్త కంగారుగానే ఉన్నారు. సో మూవీ డేట్ పై ఇంకా అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ సంక్రాంతికి కనుక ఈ మూవీ రిలీజ్ చేస్తే.. చిరు మూవీ వెనక్కి తగ్గే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చిరంజీవి విశ్వంభర సినిమా ఆల్రెడీ సంక్రాంతి బరిలో ఉంది. మరి తండ్రి కొడుకులు కలిసి సంక్రాంతికి వస్తారా.. లేదా ఎవరైనా ఒకరు తగ్గుతారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş