Nidhan
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను బిగ్ స్క్రీన్స్‌లో చూసేందుకు ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి ఇంకా టైమ్ పడుతుంది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను బిగ్ స్క్రీన్స్‌లో చూసేందుకు ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి ఇంకా టైమ్ పడుతుంది.
Nidhan
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను బిగ్ స్క్రీన్స్‌లో చూసేందుకు ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి ఇంకా టైమ్ ఉంది. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూట్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని జరుపుకోనుంది. ఇంకా చరణ్ పాత్ర షూటింగ్ కాస్త బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో ఈ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా ‘గేమ్ ఛేంజర్’ను విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
క్రిస్మస్ వీక్‌లో టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ పలు క్రేజీ మూవీస్ రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్‌తో చరణ్‌కు ఫైట్ తప్పేలా లేదు. ఎందుకంటే ఆమిర్ చిత్రం ‘సితారే జమీన్ పర్’ డిసెంబర్ 25న విడుదల కానుంది. ‘గేమ్ ఛేంజర్’ అదే నెల 20వ తేదీన ఆడియెన్స్ ముందుకు రానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద చరణ్ వర్సెస్ ఆమిర్ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఆమిర్ నటిస్తూ, స్వీయ నిర్మాణంలో రూపొందించిన ‘తారే జమీన్ పర్’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అదే సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ను తీసుకొస్తున్నారు ఆమిర్. దీంతో నార్త్ ఆడియెన్స్‌లో ఈ ఫిల్మ్ మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కోసం అక్కడి మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
‘గేమ్ ఛేంజర్’, ‘సితారే జమీన్ పర్’ ఒకే వారంలో విడుదలైతే కచ్చితంగా థియేటర్ల సమస్య వస్తుంది. అలాగే ఓపెనింగ్స్ మీద కూడా ప్రభావం పడుతుంది. చరణ్ చిత్రం ముందు విడుదలవుతుంది కాబట్టి మంచి రేంజ్లో స్క్రీన్లు దక్కుతాయి. కానీ టాక్ బాగున్నా ఆ తర్వాత సినిమా నడవడం కష్టమే. ఎందుకంటే మ్యాగ్జిమమ్ థియేటర్లను ఆమిర్ సినిమా ఆక్రమించేస్తుంది. ‘సితారే జమీన్ పర్’తో బాలీవుడ్లో సమస్యను ఎదుర్కొంటున్న మెగా పవర్‌స్టార్.. ఓవర్సీస్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 20న రానుంది. చరణ్ బిగ్ హిట్ కొట్టాలంటే ఈ రెండు సినిమాల గండాన్ని దాటాలి. ఈ త్రిముఖ పోరులో ‘గేమ్ ఛేంజర్’ ఎంతవరకు నెగ్గుకొస్తాడో చూడాలి. మరి.. ఆమిర్‌తో బాక్సాఫీస్ ఫైట్‌లో చరణ్ గెలుస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.