iDreamPost
android-app
ios-app

రంగస్థలంలో చిట్టి బాబుకి చెవుడు.. అప్పన్నకు నత్తి.. అంటే ఈ సినిమా..

  • Published Nov 25, 2024 | 5:48 PM Updated Updated Nov 25, 2024 | 5:48 PM

Game Changer Movie Updates: రంగస్థలం మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ కు చెవుడు లోపం పెట్టాడు. ఈ క్యారెక్టరైజేషన్ బాగానే వర్క్ అవుట్ అయింది. సినిమా అంచనాలను మించి బ్లాక్ బస్టర్ అందుకుంది. అలాగే పుష్ప లో అల్లు అర్జున్ కి ఓ వైపు భుజం పైకి లేచినట్లు చూపించిన లోపం కూడా బాగా పేలింది. ఇలా కొంతమంది దర్శకులు హీరోల క్యారెక్టర్స్ కు లోపాలను పెట్టి.. హిట్స్ కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గేమ్ ఛేంజర్ లోను చరణ్ క్యారెక్టర్ కు ఇలాంటి ఓ ట్విస్ట్ ఉందట.

Game Changer Movie Updates: రంగస్థలం మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ కు చెవుడు లోపం పెట్టాడు. ఈ క్యారెక్టరైజేషన్ బాగానే వర్క్ అవుట్ అయింది. సినిమా అంచనాలను మించి బ్లాక్ బస్టర్ అందుకుంది. అలాగే పుష్ప లో అల్లు అర్జున్ కి ఓ వైపు భుజం పైకి లేచినట్లు చూపించిన లోపం కూడా బాగా పేలింది. ఇలా కొంతమంది దర్శకులు హీరోల క్యారెక్టర్స్ కు లోపాలను పెట్టి.. హిట్స్ కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గేమ్ ఛేంజర్ లోను చరణ్ క్యారెక్టర్ కు ఇలాంటి ఓ ట్విస్ట్ ఉందట.

  • Published Nov 25, 2024 | 5:48 PMUpdated Nov 25, 2024 | 5:48 PM
రంగస్థలంలో చిట్టి బాబుకి చెవుడు.. అప్పన్నకు నత్తి.. అంటే ఈ సినిమా..

సాధారణంగా సినిమాలో హీరో అంటే ఓ రేంజ్ లో అంచనాలు ఉంటూ ఉంటాయి. హీరో లుక్స్ దగ్గర నుంచి మైంటైన్ చేసే స్టైల్ వరకు కూడా ప్రతిదీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. అలాంటి ఓ హీరోను డీగ్లామర్ గా చూపించి ప్రేక్షకులను మెప్పించడం అనేది అంత ఈజీ కాదు. కానీ సుకుమార్ దానిని సాధ్యం చేసి చూపించాడు. స్టార్ హీరో క్యారెక్టర్ కు శారీరక లోపం పెట్టి మాస్ ను ఒప్పించాడు. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ కు చెవుడు లోపం పెట్టాడు. ఈ క్యారెక్టరైజేషన్ బాగానే వర్క్ అవుట్ అయింది. సినిమా అంచనాలను మించి బ్లాక్ బస్టర్ అందుకుంది. అలాగే పుష్ప లో అల్లు అర్జున్ కి ఓ వైపు భుజం పైకి లేచినట్లు చూపించిన లోపం కూడా బాగా పేలింది. ఇలా కొంతమంది దర్శకులు హీరోల క్యారెక్టర్స్ కు లోపాలను పెట్టి.. హిట్స్ కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గేమ్ ఛేంజర్ లోను చరణ్ క్యారెక్టర్ కు ఇలాంటి ఓ ట్విస్ట్ ఉందట. కాకపోతే దానిని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చూపించబోతున్నాడట శంకర్.

ఇప్పటివరకు సినిమా గురించి వినిపిస్తున్న ఇన్సైడ్ టాక్ ప్రకారం.. సెకండ్ ఆఫ్ లో చరణ్ పెద్ద వయస్సు అప్పన్న గా కనిపించబోతున్నాడట. ఆ క్యారెక్టర్ కు కాస్త నత్తి ఉంటుందట. అయితే అది కథను ముందుకు తీసుకుని వెళ్లే ఓ కీలకమైన ట్విస్ట్ కు కారణం అవుతుందని సమాచారం. ఓ ఒక్క పాయింట్ కు కనుక ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటే.. ఆ ఎపిసోడ్ ఓ రేంజ్ లో పేలుతుందని టీమ్ సభ్యులు చెబుతున్నారు. రంగస్థలం , ఆర్ఆర్ఆర్ కు మించి రామ్ చరణ్ ఈ సినిమాలో పెర్ఫార్మ్ చేశాడని టాక్. ఇలా టీజర్ తర్వాత వస్తున్న టాక్ అంతా కూడా సినిమా మీద డీసెంట్ హైప్ ను క్రియేట్ చేస్తుంది. ఈ లెక్కన చూస్తుంటే జనవరి 10 న మూవీ ఎదో విధ్వసం చేయబోతోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఎందుకంటే చరణ్ సినిమా మీద అందరికి ఆ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ కూడా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. అటు ప్రమోషన్స్ కూడా అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. పైగా ఇప్పటివరకు ఏ సినిమాకు లేని విధంగా.. మొదటి సారి ఓ ఇండియన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేరే దేశంలో జరుగుతుంది. సో మూవీ టీం ఎదో భారీగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. ఇక మరి కొద్దీ రోజుల్లో మూడో ఆడియో సింగల్ ని కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఆల్రెడీ దీనిపై తమన్ అప్డేట్ ఇచ్చేసాడు. ఈ స్వీట్ మెలోడీ సాంగ్ కచ్చితంగా ఛార్ట్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప హడావిడి ముగిశాక.. గేమ్ ఛేంజర్ వేగం పెంచబోతున్నట్లు సమాచారం. ఇక రానున్న రోజుల్లో ఈ మూవీ ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomcasibomgrandpashabetmeritbet girişgrandpashabet