iDreamPost
android-app
ios-app

Rakul Preet: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఆ మూడు రోజుల్లోనే అన్నీ..!

  • Published Jan 19, 2024 | 1:47 PM Updated Updated Jan 19, 2024 | 1:47 PM

సౌత్ ఇండస్ట్రీని ఏలి బాలీవుడ్ లో సత్తా చాటేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ, ఇక్కడ సినిమాలు చేస్తూ ట్రావెల్ చేస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఎప్పుడో తన ప్రియుడ్ని పరిచయం చేయగా.. ఇప్పుడు మనువాడబోతోంది.

సౌత్ ఇండస్ట్రీని ఏలి బాలీవుడ్ లో సత్తా చాటేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ, ఇక్కడ సినిమాలు చేస్తూ ట్రావెల్ చేస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఎప్పుడో తన ప్రియుడ్ని పరిచయం చేయగా.. ఇప్పుడు మనువాడబోతోంది.

  • Published Jan 19, 2024 | 1:47 PMUpdated Jan 19, 2024 | 1:47 PM
Rakul Preet: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఆ మూడు రోజుల్లోనే అన్నీ..!

’పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది.పట్టుపంచెకి పైట కొంగుకి ముడి పెట్టె గడియే ముందున్నది. పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చేయ్, మెళ్లోన మాలవేసేయ్. అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై ఇల్లాలి పదవీ ఇచ్చేయ్’ అంటూ పాటలు పాడేసుకుంటున్నారు స్టార్ కపుల్స్. ఇటీవల కాలంలో చాలా మంది స్టార్స్ ఓ ఇంటి వారైన సంగతి విదితమే. టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. గత ఏడాది నవంబర్ 1న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో స్టార్ బ్యూటీ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఎప్పటి నుండో పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలను నిజం చేస్తూ.. వచ్చే నెలలో ఏడడుగులు వేయబోతుంది ఆ జంట.

దక్షిణాదిలో సినీ కెరీర్ స్టార్ చేసి.. బీటౌన్‌లో మెరిసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తన ప్రియుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకోబోతోంది. ఎప్పటి నుండో వీరి పెళ్లి ఉండబోతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే వివాహ తేదీని రహస్యంగా ఉంచుతూనే వచ్చారు. ఈ జంట కూడా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఫిబ్రవరి 21న వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. డిజైనర్లు, ఫోటో గ్రాఫర్లకు మాత్రమే ఈ మూడు రోజులు డేట్స్ ఇవ్వడంతో అవే రోజుల్లో వివాహం ఉండనుందని ఫిక్స్ అయిపోయారు. ఇక తమ పెళ్లి కోసం తరుణ్ తహిలియాని డిజైనర్‌గా నియమించుకున్నారు ఈ జంట.

Wedding Date Fixed

రకుల్, నిర్మాత జాకీ భగ్నానీ తమ రిలేషన్‌ను 2021లో సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రకటించినప్పటికీ.. తమ విషయాలను గోప్యంగా ఉంచడం మొదలు పెట్టారు. ఈ జంట ఎంగేజ్ మెంట్ చేశాక.. తర్వలో వివాహం చేసుకోబోతున్నారని వివిధ మీడియా కథనాలు వచ్చాయి. అయితే 2024లో ఈ కపుల్స్.. ఒక్కటి కాబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటిని నిజం చేస్తూ వచ్చే నెలలో ఒక్కటి కాబోతున్నారు ఈ జంట. అతి కొద్ది అతిధుల సమక్షంలో ఒక్కటి కానున్నారు. గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ విషయాన్ని కూడా ఇద్దరు అధికారికంగా ప్రకటించలేదు.  రకుల్ కోలీవుడ్ ప్రేక్షకులను అయలాన్ మూవీతో ఈ సంక్రాంతికి పలకరించింది. ఇప్పుడు మరో హిందీ, ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తోంది.  ఇప్పుడు వచ్చె నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. మరెందుకు ఆలస్యం.. చక చక విషెస్ చెప్పండిక ఈ దంపతులకు.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom