iDreamPost
android-app
ios-app

రష్మికతో బ్రేకప్‌.. ఆ విషయంపై స్పందించిన రక్షిత్‌ శెట్టి..

  • Published Sep 22, 2023 | 4:35 PM Updated Updated Sep 22, 2023 | 4:35 PM
  • Published Sep 22, 2023 | 4:35 PMUpdated Sep 22, 2023 | 4:35 PM
రష్మికతో బ్రేకప్‌.. ఆ విషయంపై స్పందించిన రక్షిత్‌ శెట్టి..

ప్రముఖ కన్నడ స్టార్‌ హీరో రక్షిత్‌ శెట్టి, రుక్మిణి వసంత్‌ జంటగా నటించిన సినిమా ‘ సప్త సాగర దచ ఎల్లో’. ఈ సినిమా కన్నడ నాట సెప్టెంబర్‌ 1న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాను తెలుగులో రిలీజ్‌ చేశారు. సెప్టెంబర్‌ 22న ఈ సినిమా ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో నిన్నటి వరకు రక్షిత్‌ తెలుగు మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమాతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకున్నారు.

ఓ ఇంటర్వ్యూలో రష్మికతో బ్రేకప్‌ తర్వాత వచ్చిన ‘ఎక్స్‌ బాయ్‌ ఫ్రెండ్‌’ ట్యాగ్‌పై ఆయన స్పందించారు. ‘‘ బ్రేకప్‌ అనేది అది వేరే విషయం దాని గురించి మాట్లాడదల్చుకోలేదు. జనాలు, మీడియా మీకు ఎక్స్‌ బాయ్‌ ఫ్రెండ్‌ అన్న ట్యాగు ఇవ్వటం ఎలా అనిపిస్తుంది’’ అని యాంకర్‌ అడిగాడు. ఇందుకు రక్షిత్‌ శెట్టి సమాధానం ఇస్తూ.. ‘‘ అందులో ఫీల్‌ అవ్వాల్సింది ఏమీ లేదు. అది నిజమే కదా.. ఉండనివ్వండి’’ అని అన్నారు.  కాగా, రక్షిత్‌ శెట్టి, రష్మిక మందన్న ‘కిరిక్‌ పార్టీ’ సినిమా సమయంలో ప్రేమించుకున్నారు.

ఇది రష్మిక మొదటి సినిమా. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. ఇద్దరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. అయితే, కొన్ని అనుకోని కారణాల వల్ల వీరి పెళ్లి జరగలేదు. ఇద్దరూ విడిపోయారు. తర్వాత రష్మిక తెలుగులో వరుస విజయాలతో స్టార్‌ హీరోయిన్‌ అయింది. పుష్ప సినిమా విజయంతో ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయింది. రక్షిత్‌ 777 ఛార్లీ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్నారు. తెలుగులోనూ మంచి మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. మరి, రక్షిత్‌ ఎక్స్‌ బాయ్‌ ఫ్రెండ్‌ ట్యాగుపై స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet