iDreamPost
android-app
ios-app

మా నాన్న అలా అవ్వడానికి కారణం వాళ్లే! రాకేష్ మాస్టర్ కొడుకు సంచలన వ్యాఖ్యలు..

  • Author Soma Sekhar Published - 01:05 PM, Sat - 24 June 23
  • Author Soma Sekhar Published - 01:05 PM, Sat - 24 June 23
మా నాన్న అలా అవ్వడానికి కారణం వాళ్లే! రాకేష్ మాస్టర్ కొడుకు సంచలన వ్యాఖ్యలు..

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కొన్ని రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. ఇక ఇండస్ట్రీలో ప్రభాస్, మహేష్ బాబు లాంటి ఎందరో హీరోలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ శిష్యూలే అన్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే రాకేష్ మాస్టర్ మరణంపై ఆయన కొడుకు చరణ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న అలా అవ్వడానికి కారణం వాళ్లే అంటూ.. మా ఫ్యామిలీ జోలికి రావొద్దంటూ వారిని వేడుకున్నాడు.

రాకేష్ మాస్టర్ మరణాణంతరం పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు అతడి కొడుకు చరణ్. మా నాన్న అలా కావడానికి ప్రధాన కారణం వాళ్లే అని మండిపడ్డాడు. తన తండ్రి చివరి రోజుల్లో దుర్బర స్థితికి చేరుకోవడానికి కారణం కొన్ని యూట్యూబ్ ఛానల్సే అని అసహనం వ్యక్తం చేశాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు పలు యూట్యూబ్ ఛానల్స్ పై మండిపడ్డాడు. రాకేష్ మాస్టర్ కొడుకు మాట్లాడుతూ..”మా నాన్న ఇలా తయ్యారు అవ్వడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లాభపడేందుకు మా నాన్నను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత వారే మా నాన్నను నెగటీవ్ గా చూపించారు. ఇప్పటికైనా ఇలాంటి వీడియోలు ఆపేయండి. దయచేసి మా కుటుంబ వీడియోలు ప్రసారం చేయకండి” అంటూ యూట్యూబ్ ఛానల్స్ ను వేడుకున్నాడు.