iDreamPost
android-app
ios-app

వీడియో: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో రజినీకాంత్ స్టెప్పులు అదుర్స్!

  • Published Jul 13, 2024 | 8:17 AM Updated Updated Jul 13, 2024 | 8:17 AM

Rajnikanth Dancing: దేశంలో ఇప్పటి వరకు ఏ ఇంట జరగని పెళ్లి వేడుకలు నిన్న అంబానీ ఇంట కనిపించాయి. ప్రపంచ వ్యాప్తంగా నిన్న అంబానీ తనయుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల గురించే చర్చలు సాగాయి.

Rajnikanth Dancing: దేశంలో ఇప్పటి వరకు ఏ ఇంట జరగని పెళ్లి వేడుకలు నిన్న అంబానీ ఇంట కనిపించాయి. ప్రపంచ వ్యాప్తంగా నిన్న అంబానీ తనయుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల గురించే చర్చలు సాగాయి.

  • Published Jul 13, 2024 | 8:17 AMUpdated Jul 13, 2024 | 8:17 AM
వీడియో: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో రజినీకాంత్ స్టెప్పులు అదుర్స్!

ఆసియాలోనే అపర కుభేరుడు, రిలయన్స్ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల వివాహం శుక్రవారం అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. దేశంలోనే ఈ పెళ్లి కనీ వినీ ఎరుగని రీతిలో ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుండి పోయేలా జరిపించారు ముఖేష్ అంబానీ- నీతా అంబానీ దంపతులు. ఈ పెళ్లికి విచ్చేసిన వీవీఐపీ అతిథుల కోసం కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక ఫైట్లు ఏర్పాటు చేశారు. ఇక పెళ్లి భోజనంలో 3వేల రకాల వంటకాలతో అదరహో అనిపించారు. పెళ్లి వేడుకలో సినీ సెలబ్రెటీలు, క్రీకెటర్లు సందడి చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్.. అనంత్ అంబానీతో కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 60 ఏళ్లు దాటినా ఆయన ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకొని ప్రేక్షకుల మెప్పిస్తున్నారు. రజినీకాంత్ ఏది చేసినా స్టైలే. ముఖేష్ అంబానీ -నీతా అంబానీ ముద్దుల తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ పెళ్లి శుక్రవారం ముంబై‌ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అంతరంగ వైభవంగా జరిగింది. జులై 12న శుభ్ వివాహతో వేడుకలు మొదలై.. జులై 13న శుభ్ ఆశీర్వాద్, జులై14న మంగళ్ ఉత్సవ్ వివాహ వేడుకల తంతు ముగుస్తుంది. ఈ వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఉత్సాహంగా డ్యాన్స్ వేసి అందరినీ అలరించారు.

పెళ్లి కొడుకు అనంత్ అంబానీతో కలిసి రజినీకాంత్ స్టెప్పులు వేయడంతో అక్కడే ఉన్న బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ ఆయనతో కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రజినీకాంత్ స్టెప్పులు అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాహ సంబరాల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, సినీ, క్రీడా,రాజకీయ రంగానికి చెందినవారు.. ఇతర కళాకారులు, వివిధ రంగాల్లోని ప్రముఖులు పాలు పంచుకున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş