iDreamPost
android-app
ios-app

Rajini Kanth: సూపర్ స్టార్ కు షాక్.. భారీ బ్లాక్ బస్టర్ తరువాత డిజాస్టర్!

  • Published Feb 11, 2024 | 1:04 PM Updated Updated Feb 11, 2024 | 1:04 PM

జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ కు భారీ షాక్ ఇచ్చారు ప్రేక్షకులు. లాల్ సలామ్ మూవీ ఊహించిన రేంజ్ లో ఉండకపోవడంతో.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ కు భారీ షాక్ ఇచ్చారు ప్రేక్షకులు. లాల్ సలామ్ మూవీ ఊహించిన రేంజ్ లో ఉండకపోవడంతో.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

  • Published Feb 11, 2024 | 1:04 PMUpdated Feb 11, 2024 | 1:04 PM
Rajini Kanth: సూపర్ స్టార్ కు షాక్.. భారీ బ్లాక్ బస్టర్ తరువాత డిజాస్టర్!

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ రూపంలో గత సంవత్సరం ఆగస్ట్ లో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టడంతో చాలా ఏరియాల్లో కనీసం రెండు వారాల పాటు హౌస్ ఫుల్స్ వచ్చాయి. అంతే కాకుండా సినిమా తెలుగులో కూడా దాదాపు వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి భారీ విజయం సాధించింది. అయితే రజినీ కొత్త సినిమా లాల్ సలామ్ విషయానికి వస్తే ఈ సినిమా అన్ని ఏరియాల్లో క్లియర్ కట్ వాష్ అవుట్ గా నిలిచింది. భారీ బ్లాక్ బస్టర్ తరువాత ఇలాంటి డిజాస్టర్ పడటం సూపర్ స్టార్ కు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. లాల్ సలామ్ రిలీజ్ అయి ఇంకా రెండు రోజులే అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కోలుకునే అవకాశం లేనట్టే కనిపిస్తుంది.

తమిళంలో కూడా ఈ సినిమా కలెక్షన్లు అంతగా బాగాలేవు. రజినీ ముఖ్య పాత్ర పోషించినా అది ఆయన స్థాయికి తగ్గట్టు లేదని విమర్శకులు, అభిమానులు ఈ సినిమా పై నెగిటివ్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ బాగాలేదని అంటున్నారు. అటు రజినీకాంత్ ఇమేజ్ ను సరిగ్గా వాడుకోక పోగా, ఇటు నటనకు కూడా స్కోప్ లేదని అభిమానులు బాధ పడ్డారు. అన్నింటికీ మించి రజినీకాంత్ జైలర్ మానియా తెలుగులో కానీ, తమిళంలో కానీ లాల్ సలామ్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఎందుకంటే ఆయన నుంచి ప్రేక్షకులు ఆశించే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో లేదు. అందుకే మొదటి ఆట నుంచే ఈ సినిమాని ప్రేక్షకులు తిప్పి కొట్టారు.

ప్రేక్షకులు ఒక సినిమాలో హీరో ఎవరైనా ఆ సినిమా నుండి కాస్త ఎంగేజింగ్ కంటెంట్ కోరుకుంటున్నారే తప్ప కేవలం సూపర్ స్టార్ల పేరు చూపించి సినిమాను సక్సెస్ చేయలేరనే విషయం లాల్ సలామ్ ద్వారా మరోసారి స్పష్టమైంది. టెంప్లేట్ సినిమాలతో నిలదొక్కుకోవచ్చని అనుకునే ఎవరికైనా లాల్ సలామ్ రిజల్ట్ ఒక హెచ్చరికగా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల ప్రాధాన్యతలు ప్రతిరోజూ మారుతున్నాయి. అందుకే హీరోలు, దర్శక నిర్మాతలు దీనిని గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని సినీ పండితులు పేర్కొంటున్నారు.

ఇదికూడా చదవండి: లాల్ సలామ్ OTT పార్టనర్ ఫిక్స్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Jojobet GirişjojobetJojobetJojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet