iDreamPost
android-app
ios-app

హీరో విజయ్‌ నన్ను బెదిరిస్తున్నారు.. అరెస్ట్‌ చేయండి: రాజేశ్వరి ప్రియ

  • Published Jul 07, 2023 | 4:38 PM Updated Updated Jul 08, 2023 | 10:44 AM
  • Published Jul 07, 2023 | 4:38 PMUpdated Jul 08, 2023 | 10:44 AM
హీరో విజయ్‌ నన్ను బెదిరిస్తున్నారు.. అరెస్ట్‌ చేయండి: రాజేశ్వరి ప్రియ

దక్షిణాది సినీ పరిశ్రమలో.. టాప్‌ హీరోగా రాణిస్తున్నాడు దళపతి విజయ్‌. తమిళంతోపాటు.. తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఈమధ్యనే వారసుడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు విజయ్‌. ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. ప్రస్తుతం విజయ్‌ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవలే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ లియో చిత్రంపై భారీ హైప్‌ క్రియేట్‌ చేశాయి. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ నా రెడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాట యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది. అదే సమయంలో వివాదాలను కూడా మూట కట్టుకుంటుంది.

కారణం ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించడం. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇప్పటికే పలువురు కోర్టును ఆశ్రయించారు. ఇలా న్యాయస్థానికి వెళ్లిన వారిలో ఆల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా ఉన్నారు. లియో సినిమా విషయంలోనే కాదు.. ఆమె గతంలో కూడా అనేకసార్లు విజయ్‌ను టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేసింది. ఇక తాజాగా మరోసారి హీరో విజయ్‌పై రాజేశ్వరి సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాక విజయ్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు..

హీరో విజయ్.. తన అభిమానులను రెచ్చగొట్టి.. సోషల్ మీడియాలో తనపైకి ఉసిగొల్పుతున్నారని.. అభిమానుల ద్వారా తనను బెదిరిస్తున్నారంటూ రాజేశ్వరి.. చెన్నై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇటీవల వచ్చిన విజయ్ సినిమాలో స్మోకింగ్ వీడియోలపై నిరసనలు చేసినందుకే.. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా మాట్లాడుతూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అంతేకాక విజయ్ సోషల్ మీడియా ఐడీని ట్యాగ్ చేస్తూ తనపై అసభ్యపదజాలంతో కామెంట్స్ చేస్తున్నారని.. హీరో విజయ్ కూడా తనను బెదిరించాడంటూ రాజేశ్వరి సంచలన ఆరోపణలు చేసింది. ఓ మహిళగా తనను అవమానపరుస్తూ మాట్లాడేలా విజయ్‌ తన అభిమానులను రెచ్చగొట్టారని.. అందుకే ఆయనను పోలీసులు అరెస్ట్ చేయాలని రాజేశ్వరి డిమాండ్ చేసింది. ఇక లియో చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్‌ సింగ్‌ల సాంగ్‌లో స్మోకింగ్, రౌడీయిజం ఎక్కువగా చూపించారని.. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుందని పాటలో ఉన్నాయని తెలిపింది. గతంలో ఇలాంటి సన్నివేశాలు ఉండటంతో.. సూపర్ స్టార్ రజినీకాంత్ పై కూడా తాము ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది. ప్రస్తుతం రాజేశ్వరి ప్రియ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet