iDreamPost
android-app
ios-app

రాజన్న మూవీ చిన్నారి.. ఇంతందంగా మారి పోయిందేంటి..!

  • Published May 13, 2024 | 5:46 PM Updated Updated May 13, 2024 | 5:46 PM

సెలబ్రిటీల చిన్ననాడి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. వీరిలో చైల్డ్‌ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఆ వివారలు..

సెలబ్రిటీల చిన్ననాడి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. వీరిలో చైల్డ్‌ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఆ వివారలు..

  • Published May 13, 2024 | 5:46 PMUpdated May 13, 2024 | 5:46 PM
రాజన్న మూవీ చిన్నారి.. ఇంతందంగా మారి పోయిందేంటి..!

ఈమధ్య కాలంలో సోషల్‌ మీడియాలో పిక్‌ టాక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. సినీ సెలబ్రిటీల చిన్న నాటి ఫొటోలు, వారు ఫిల్మ్‌ ఇండస్ట్రీకి రాని కాలంలో తీసిన ఫొటోలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. వీటిల్లో కొందరు సెలబ్రిటీలను అయితే అసలు గుర్తు పట్టలేకుండా ఉన్నాము. వారు ఇప్పుడు తెర మీద కనిపించే వారి రూపానికి.. ఫొటోలో వారు ఉన్న తీరుకు పోల్చుకోవడం చాలా కష్టం. ఇక సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌లుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చిన్నారులు సైతం.. ఇప్పుడు గుర్తు పట్టలేకుండా మారిపోయారు. వారిలో కొందరైతే సినిమా హీరోహీరోయిన్లకు మించిన గ్లామర్‌తో అందంగా ఉన్నారు. అలాంటి ఓ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ లేటేస్ట్‌ పిక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. చిన్నప్పుడు అంత క్యూట్‌గా ఉన్న పాప.. ఇప్పుడు ఇంత అందంగా మారిందా.. అని ఆశ్చర్యపోతున్నారు నెటిజనులు.

అనీ గుర్తుందా.. ‘రాజన్న’ సినిమాలో నాగార్జున-స్నేహల కూతురు మల్లమ్మ పాత్రలో అద్భుత నటన కనబరిచి తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా నంది అవార్డు అందుకున్న బాలనటి అనీ. 2005లో వచ్చిన ‘అనుకోకుండా ఒకరోజు’ సినిమాతో బాలనటిగా వెండితెరకు పరిచయమైన అనీ.. ఆ తర్వాత ‘స్టాలిన్’, ‘అతిథి’, ‘రెడీ’, ‘శౌర్యం’, ‘ఏక్ నిరంజన్’, ‘కేడీ’, ‘ఖలేజా’ తదితర చిత్రాల్లో నటించింది. అయితే రాజన్న సినిమాలో చేసిన పాత్ర ద్వారా తనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాత్రలో నటనకు గాను ఏకంగా నంది అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత అంత మంచి పాత్ర తన ఖాతాలో పడలేదు. ఇక బాలనటిగా చివరిగా.. ‘రంగస్థలం’ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో చిట్టిబాబు (రామ్ చరణ్)కు చెల్లెలిగా నటించింది అనీ.

బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనీ.. తాజాగా హీరోయిన్‌గా మారింది. ‘తికమక తాండ’ అనే సినిమాలో ఆని లీడ్ రోల్ పోషించింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇక అనీ వ్యక్తిగత విషయాలకు వస్తే.. తను ప్రస్తుతం హైదరాబాద్‌లోని అవినాష్‌ డిగ్రీ కాలేజీలో కామర్స్‌ చదువుతోంది. ప్రస్తుతం అనీ లేటెస్ట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. మల్లన్న చిత్రంలో ఎంతో క్యూట్‌గా ఉన్న చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్లకు మించిన గ్లామర్‌, అందంతో యువత గుండె కొల్లగొడుతుంది అంటున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişberlinbet girişgrandpashabet