iDreamPost
android-app
ios-app

సుకుమార్ గ్రాండ్ ప్లానింగ్.. పుష్ప2 టీం తో జక్కన్న..?

  • Published Nov 13, 2024 | 12:53 PM Updated Updated Nov 13, 2024 | 12:53 PM

Rajamouli With Pushpa 2 team: వరల్డ్ వైడ్ గా పుష్ప 2 కోసం అంతా వెయిట్ చేస్తున్నారనే విషయంలో కొత్తేమి లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించడంతో పాటు. విభిన్నమైన ఇంటర్వూస్ , టాక్ షోస్ తో సందడి చేయనున్నారు మేకర్స్.అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే..పుష్ప 2 టీం తో జక్కన్న కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడట.

Rajamouli With Pushpa 2 team: వరల్డ్ వైడ్ గా పుష్ప 2 కోసం అంతా వెయిట్ చేస్తున్నారనే విషయంలో కొత్తేమి లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించడంతో పాటు. విభిన్నమైన ఇంటర్వూస్ , టాక్ షోస్ తో సందడి చేయనున్నారు మేకర్స్.అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే..పుష్ప 2 టీం తో జక్కన్న కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడట.

  • Published Nov 13, 2024 | 12:53 PMUpdated Nov 13, 2024 | 12:53 PM
సుకుమార్ గ్రాండ్ ప్లానింగ్.. పుష్ప2 టీం తో జక్కన్న..?

వరల్డ్ వైడ్ గా పుష్ప 2 కోసం అంతా వెయిట్ చేస్తున్నారనే విషయంలో కొత్తేమి లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో అటు మూవీ మేకర్స్ సినిమా కంప్లీట్ చేయడానికి ఎంత హడావిడి పడుతున్నారో.. బయట ఫ్యాన్స్ అంతకుమించిన హడావిడి క్రియేట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఐటెం సాంగ్ గురించి డిస్కషన్ బాగా జరిగింది. ఇక ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా లాక్ అయింది. అలాగే రన్ టైం విషయంలోనూ క్రేజి అప్డేట్ చూసేసాం. ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే.. సినిమాలోని ఐటెం సాంగ్ ను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ వంతు. ప్రమోషన్స్ కోసం క్రికెటర్స్ ను రంగంలోకి దించుతున్నారనే వార్తా బాగా స్ప్రెడ్ అయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించడంతో పాటు. విభిన్నమైన ఇంటర్వూస్ , టాక్ షోస్ తో సందడి చేయనున్నారు మేకర్స్. రీసెంట్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో పుష్ప టీం సందడి చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇలాంటి షోస్ ఇతర భాషల్లో కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ ప్రమోషన్స్ లో జక్కన్న కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడట.

గతంలో కూడా పార్ట్ 1 ప్రమోషన్స్ లో రాజమౌళి భాగస్వామి అయ్యారు. ఇక ఇప్పుడు మరో సారి పుష్ప 2 కోసం ముందుకు రానున్నాడట జక్కన్న. దానికోసం సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎంతో మంది రాజమౌళిని అభిమానిస్తుంటే.. రాజమౌళి మాత్రం తన అభిమాన దర్శకుడు సుకుమార్ అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. సో జక్కన్న ఎంత బిజీ గా ఉన్నా కానీ సుక్కు పిలిచాడంటే వెంటనే వచ్చేస్తాడు. ఈ క్రమంలోనే రాజమౌళి హోస్ట్ గా సుకుమార్ , అల్లు అర్జున్ , రష్మిక లతో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు ఈ ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా రాజమౌళి కొన్ని సార్లు సుకుమార్ సినిమాల ప్రమోషన్స్ లో హెల్ప్ చేశారు. ఇప్పుడు మరోసారి ఇది రిపీట్ అవుతుంది. ఇదే కనుక జరిగితే పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప 2 మీద మరింత హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం.

అటు ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న మహేష్ ప్రాజెక్ట్ లో బిజీ అయ్యాడు. గత కొన్ని రోజులుగా స్క్రిప్ట్ వర్క్ , లొకేషన్ హంట్ లాంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో మరింత బిజీ అయ్యాడు. అయినా సరే సమయం దొరికినప్పుడల్లా జక్కన్న పలు సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ లో దర్శనం ఇచ్చాడు . ఈ క్రమంలో పుష్ప 2 ప్రమోషన్స్ కోసం కూడా రాజమౌళి ఒకే చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో మొత్తానికి పుష్ప 2 కోసం రాజమౌళి ఓ ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఈ ఇంటర్వ్యూ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని టాక్. ఇక ఏమౌతుందో చూడాలి. పుష్ప హైప్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది పుష్ప 2. ఇక రిలీజ్ తర్వాత లెక్కలు మాట్లాడుకోవడమే బ్యాలెన్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet