Swetha
హర్రర్ జోనర్ సినిమాలకు సెపరేట్ గా స్పెషల్ కథలు ఏమి అవసరం లేదు. దానికి కావాల్సిందల్లా అదిరిపోయే విజువల్స్ దానికి సింక్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ , ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కుర్చోపెట్టే ట్విస్ట్ లు టర్నింగ్ పాయింట్ లు. ఇంతే ఇవన్నీ పక్కా కొలతలతో కలిపి ఓ సినిమా తీస్తే ఇంకా కాసుల వర్షం గ్యారెంటీ. ఇప్పటికే ఈ ఫార్ములా అప్లై చేసి చాలా మంది దర్శకనిర్మాతలు లాభాలు పొందుతున్నారు.

హర్రర్ జోనర్ సినిమాలకు సెపరేట్ గా స్పెషల్ కథలు ఏమి అవసరం లేదు. దానికి కావాల్సిందల్లా అదిరిపోయే విజువల్స్ దానికి సింక్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ , ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కుర్చోపెట్టే ట్విస్ట్ లు టర్నింగ్ పాయింట్ లు. ఇంతే ఇవన్నీ పక్కా కొలతలతో కలిపి ఓ సినిమా తీస్తే ఇంకా కాసుల వర్షం గ్యారెంటీ. ఇప్పటికే ఈ ఫార్ములా అప్లై చేసి చాలా మంది దర్శకనిర్మాతలు లాభాలు పొందుతున్నారు. కానీ తెలుగులో బడా హీరోలు ఇలాంటి జోనర్స్ టచ్ చేయడానికి కాస్త సందేహిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు డార్లింగ్ ఆ బోర్డర్స్ క్రాస్ చేసి హర్రర్ కామిడి మొదటిసారి రాజాసాబ్ గా వచ్చేస్తున్నాడు.
సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా.. రాజాసాబ్ నుంచి మొదటి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ఒక్క ట్రైలర్ తోనే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే హింట్ ఇచ్చేశారు. ట్రైలర్ ను గమనిస్తే సినిమాలో కంటెంట్ టన్నులు టన్నులు ఉందని అనిపించడం ఖాయం. ఇక ఆ విజువల్స్ , ఎలివేషన్స్ , డార్లింగ్ వింటేజ్ వైబ్స్ , కామిడి, రొమాంటిక్ యాంగిల్స్ , హీరోయిన్స్ ఇలా చెప్పుకుంటే పోతే.. రాజాసాబ్ మొదటి ట్రైలర్.. అటు డార్లింగ్ అభిమానుల వింటేజ్ ఆకలి తీర్చడంతో పాటు.. ఇటు కామన్ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేసి ఐ ఫీస్ట్ గా నిలిచిపోయింది.
కథాపరంగా దర్శకుడు చాలానే హింట్స్ ఇచ్చేసాడు. చనిపోయిన తన తాత( సంజయ్ దత్) ఆస్తిని, బంగాళాను ఎవరో స్వాధీనం చేసుకున్నారని ప్రభాస్ గుర్తిస్తాడు. దీనితో కొందరితో కలిసి అక్కడకు వెళ్తాడు. కానీ అక్కడ వ్యవహారం అనుకున్నంత సులువుగా నడవదు అర్ధమౌతుంది. దెయ్యాలు , భూతాలు , విచిత్ర జంతువులు ఇలా మొత్తం ఓ మాయాలోకంలా రాజాసాబ్ కథ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ రాజసాబ్ నుంచి వచ్చే అప్డేట్స్ ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.