iDreamPost
android-app
ios-app

మీడియా ముందుకి రాజ్ తరుణ్! మొహం దాచిన ఉపయోగం లేక!

  • Published Jul 30, 2024 | 6:27 PM Updated Updated Jul 30, 2024 | 6:27 PM

Raj Tarun.. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. లావణ్య అనే యువతి తనను రాజ్ మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఇష్యూ ఇంకా కొనసాగుతుంది. అయితే అప్పుడెప్పుడో మీడియా ముందుకు వచ్చిన రాజ్.. మళ్లీ..

Raj Tarun.. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. లావణ్య అనే యువతి తనను రాజ్ మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఇష్యూ ఇంకా కొనసాగుతుంది. అయితే అప్పుడెప్పుడో మీడియా ముందుకు వచ్చిన రాజ్.. మళ్లీ..

  • Published Jul 30, 2024 | 6:27 PMUpdated Jul 30, 2024 | 6:27 PM
మీడియా ముందుకి రాజ్ తరుణ్! మొహం దాచిన ఉపయోగం లేక!

తెలుగులో బాయ్ నెక్ట్స్ డోర్‌లా ఉండే నటుడు రాజ్ తరుణ్. తన చలాకీ నటనతో తొలి సినిమాతో మంచి మార్కులు కొట్టేశాడు. ఉయ్యాల జంపాల మూవీతో మొదలైన కెరీర్.. ఫస్ట్ మూడు చిత్రాలతో పీక్స్‌కు చేరింది. కానీ ఆ తర్వాత సినిమా కథల విషయంలో తడబడుతూ వస్తున్నాడు. ఒరేయ్ బుజ్జిగా ఓకే అనిపించినా.. ఆ తర్వాత ఒక్క హిట్టు చూడలేదు. ఈ ఏడాది వచ్చిన నా సామి రంగా కూడా నాగార్జున ఖాతాలోకి చేరిపోయింది. ఇప్పుడు అతడికి హిట్ చాలా ముఖ్యం. ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ కామన్. ఒక్క మూవీతో కంబ్యాక్ ఇచ్చిన వాళ్లున్నారు. కెరీర్ పరంగా దెబ్బతింటే మళ్లీ కోలుకోవచ్చు. కానీ రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం వివాదాస్పదమై వార్తల్లో నిలిచాడు. తనను రాజ్ తరుణ్ శారీరకంగా, మానసికంగా వినియోగించుకుని మోసం చేశాడంటూ ఆయన ప్రియురాలు లావణ్య పోలీసు మెట్లెక్కడంతో ఒక్కసారిగా అన్ని వేళ్లు రాజ్ తరుణ్ వైపు చూపించడం మొదలు పెట్టాయి.

తిరగబడరా సామి మూవీ హీరోయిన్ మాన్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్ మెయిన్ టైన్ చేస్తూ తనను మోసం చేశాడంటూ ఈ నెల 5న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. ఒక్కసారిగా ఈ వార్త దావనంలా వ్యాపించింది. అప్పటి నుండి ఇప్పటికీ ఈ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఆమె డ్రగ్స్‌కు బానిసైందని, మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉందని, తనే నన్ను మోసం చేసిందంటూ మీడియా ముందు వాపోయాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత కనిపించలేదు. అయితే రాజ్ తరుణ్, తాను సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఇతర వివరాలు పోలీసులకు ఇవ్వడంతో అతడిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కాంట్రవర్సీ సమయంలోనే సినిమాను క్యాష్ చేసుకుందామనుకున్నారు అతడితో మూవీస్ చేసిన దర్శక నిర్మాతలు. పురుషోత్తముడు అనే మూవీ ఇటీవల రిలీజ్ అయ్యింది. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

దీనికి ప్రధాన కారణం రాజ్ తరుణ్ ఎలాంటి ప్రమోషన్లు చేయలేదు, ఈవెంట్స్‌కు హాజరు కాలేదు. మీడియా ముందుకు వచ్చింది లేదు. కాగా, ఇప్పుడు మాల్వీ, రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామీ కూడా రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 2వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో పురుషోత్తముడు ఫలితాన్ని చూసి ఆందోళన చెందిన తిరగబడరా సామి నిర్మాత మల్కాపురం శివ.. సినిమా ప్రమోషన్ల కోసం రాజ్ తరుణ్, మాల్వీ తీసుకువస్తున్నారట. రేపు లేదా ఎల్లుండి ఈ ప్రెస్ మీట్ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక కాంట్రవర్సీకి కారణమైన ఇద్దరు వస్తున్నారంటే.. కచ్చితంగా లావణ్య ఇష్యూపై ప్రశ్నలు ఎదురు అవుతాయి. వీటన్నింటికి ప్రిపైర్ అయ్యే ఇద్దరు మీడియా ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు తాను మీడియా ముందుకు రాకపోవడం వల్ల సినిమాకు, నిర్మాతలకు నష్టం వాటిల్లడం వల్ల..ఈ రిస్క్ చేస్తున్నాడట రాజ్. ఇప్పటికైనా వచ్చి అన్ని నిజాలు బయట పెడతాడేమో చూడాలి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbaymavi girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio