iDreamPost
android-app
ios-app

RJ Shekar Basha:వీడియో: RJ శేఖర్‌ బాషాపై దాడి.. ఆస్పత్రిలో కన్నీరు పెట్టుకుని మరీ రిక్వెస్ట్‌

  • Published Aug 05, 2024 | 11:47 AM Updated Updated Aug 05, 2024 | 11:47 AM

Raj Tarun Lavanya-Attack On RJ Shekar Basha: రాజ్‌ తరుణ్‌, లావణ్యల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఆర్జే శేఖర్‌ బాషా తనపై దాడి జరిగిందని ఆరోపించారు. ఆస్పత్రిలో ఉన్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

Raj Tarun Lavanya-Attack On RJ Shekar Basha: రాజ్‌ తరుణ్‌, లావణ్యల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఆర్జే శేఖర్‌ బాషా తనపై దాడి జరిగిందని ఆరోపించారు. ఆస్పత్రిలో ఉన్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published Aug 05, 2024 | 11:47 AMUpdated Aug 05, 2024 | 11:47 AM
RJ Shekar Basha:వీడియో: RJ శేఖర్‌ బాషాపై దాడి.. ఆస్పత్రిలో కన్నీరు పెట్టుకుని మరీ రిక్వెస్ట్‌

సినీనటుడు రాజ్‌తరుణ్‌ – లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక ఈ మధ్య కాలంలో లావణ్యపై అనేక ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఆమె అమాయకులకు డ్రగ్స్‌ అలవాటు చేసి.. వారి వీడియోలు చిత్రీకరించి.. బెదిరింపులకు పాల్పడుతుంది అని తాజా ఆరోపణలు. ఇక ఈ వివాదంలో ఇప్పుడు ఆర్‌జే శేఖర్‌ బాషా కూడా కీలకంగా మారాడు. ఆయన లావణ్యపై నమోదైన కేసులతో పాటుగా.. అనేక సంచలన ఆరోపణలు చేస్తూ.. వీడియోలు రిలీజ్‌ చేయడం, ఇంటర్వ్యూలు ఇస్తూ.. కేసులో కొత్త కోణాలు వెలుగులోకి తెస్తున్నాడు.

ప్రస్తుతం లావణ్య-శేఖర్‌ బాషాల మధ్య వివాదం ముదురుతోంది. రెండు మూడు రోజుల క్రితం లావణ్య.. టీవీ డిబెట్‌లో శేఖర్‌ బాషా మీద చెప్పుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. శేఖర్‌ బాషాపై దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

శేఖర్‌ బాషాపై దాడి జరిగింది. ప్రస్తుతం ఆయన కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లావణ్య, ఆమె మద్దతుదారులు తనపై దాడి చేశారని చెప్పుకొచ్చాడు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి కొట్టారని చెప్పుకొచ్చారు. తన కుటుంబ సభ్యులు వద్దంటున్నా.. తాను మాత్రం డ్రగ్స్‌ మాఫియాపై పోరాటం చేస్తానని.. మీడియా దయచేసి ఈ విషయంలో తనకు మద్దతుగా లేకున్నా పర్లేదు కానీ.. భయపట్టేలా మాట్లాడకూడదని చెబుతూ కన్నీటిపర్యంతం అయ్యాడు. అంతేకాక తనకు ఎవరి సానుభూతి అవసరం లేదని.. డ్రగ్స్‌పై తన పోరాటం ఆగదని మరోసారి స్పష్టం చేశాడు శేఖర్‌ బాషా.

ఇదిలా ఉండగా.. ఇదే అంశంపై లావణ్య సైతం సంచలన ఆరోపణలు చేసింది. రాజ్‌తరుణ్‌ స్నేహితుడైన ఆర్‌జే శేఖర్‌ బాషా తనపై దాడికి పాల్పడ్డాడని.. ఒంటరిగా ఉన్న సమయం చూసి తన కడుపులో తన్నాడు అని ఆరోపిస్తూ.. ఆమె జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.