iDreamPost
android-app
ios-app

Raj Tarun: రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్‌.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

  • Published Jul 06, 2024 | 12:14 PM Updated Updated Jul 06, 2024 | 12:14 PM

రాజ్‌ తరుణ్‌ కేసులో కీలక ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అతడి ప్రియురాలు లావణ్యకు నార్సింగ్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ వివరాలు..

రాజ్‌ తరుణ్‌ కేసులో కీలక ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అతడి ప్రియురాలు లావణ్యకు నార్సింగ్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ వివరాలు..

  • Published Jul 06, 2024 | 12:14 PMUpdated Jul 06, 2024 | 12:14 PM
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్‌.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

హీరో రాజ్‌ తరుణ్‌ మీద అతడి ప్రియురాలు లావణ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గత పదకొండేళ్లుగా తామిద్దరు రిలేషన్‌లో ఉన్నామని.. గుడిలో పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది. ఇప్పుడు రాజ్‌ తరుణ్‌ మరో హీరోయిన్‌ మోజులో పడి తనను దూరం పెడుతున్నాడని.. ఆ హీరోయిన్‌, ఆమె సోదరుడు తనను చంపుతామని బెదిరిస్తున్నారని.. చెప్పుకొచ్చింది. అంతేకాక తనను వదిలించుకోవడం కోసమే డ్రగ్స్‌ కేసులో ఇరికించారని ఆరోపిస్తూ.. నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఆరోపణలపై రాజ్‌ తరుణ్‌ స్పందిస్తూ.. లావణ్యే తనను వేధిస్తుందని.. ఆమెకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందని.. మరొకరితో ఆమెకు రిలేషన్‌ ఉందని తెలిసి.. ఆమె వ్యవహార శైలి నచ్చకే దూరం పెట్టానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లావణ్యకు నార్సింగ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ వివరాలు..

లావణ్య.. శుక్రవారం నాడు రాజ్‌ తరుణ్‌ మీద ఆరోపణలు చేస్తూ.. నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రమే పోలీసులు లావణ్యకు నోటీసులు జారీ చేశారు. రాజ్‌ తరుణ్‌ మీద ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సంమర్పించాలని ఆదేశిస్తూ.. ఆమెకి 91 సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు లావణ్య పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం. మరి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

రాజ్‌ తరుణ్‌ తన మీద చేసిన ఆరోపణలని లావణ్య ఖండించింది. రాజ్‌ తరుణ్‌కి తనతోనే కాకుండా మరి కొందరు అమ్మాయిలతో కూడా రిలేషన్‌ ఉందని.. అతడి బండారన్ని ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పుకొచ్చింది. తనపై రాజ్‌ తరుణ్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని వివరించింది. అంతేకాక తాను మస్తాన్‌ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్లు రాజ్‌ తరుణ్‌ ఆరోపించాడు కదా.. ఆ మస్తాన్‌ అనే వ్యక్తిని తీసుకునే మీడియా ముందుకు వస్తాను అంటుంది. ఇక రాజ్‌ తరుణ్‌ విషయానికి వస్తే.. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు విచారణ కోసం నార్సింగ్‌ పోలీసులు ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు తాను వచ్చి.. తన వర్షన్‌ చెబుతాను అన్నాడు. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

marsbahis girişjojobetjojobet giriş