iDreamPost
android-app
ios-app

Raj Tarun Case: హీరో రాజ్‌ తరుణ్‌, మాల్వీ మెసెజ్‌ చాట్స్‌ లీక్‌! ఏకంగా హోటల్ రూమ్‌లో!

  • Published Jul 19, 2024 | 12:45 PMUpdated Jul 19, 2024 | 12:45 PM

Raj Tarun Case-Lavanya Reveals Message Chats: హీరో రాజ్‌ తరుణ​ వ్యవహారంలో రోజుకో సంచలన వార్త వెలుగులోకి వస్తుంది. తాజాగా లావణ్య.. రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రాల మధ్య జరిగిన మెసెజ్‌ చాట్‌ని లీక్‌ చేసింది. ఆ వివరాలు..

హీరో రాజ్‌ తరుణ్‌ వ్యవహారంలో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. లావణ్య ఫిర్యాదు మేరకు రాజ్‌ తరుణ్‌ మీద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్‌ తరుణ్‌, తాను 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. ఇద్దరు గుడిలో వివాహం కూడా చేసుకున్నారని.. ఇన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న తమ మధ్య హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా రాకతో గొడవలు మొదలయ్యాయని లావణ్య చెప్పుకొచ్చింది. మాల్వీకి, రాజ్‌ తరుణ్‌కి ఇల్లీగల్‌ రిలేషన్‌ ఉందని.. ఆమె కోసం రాజ్‌.. తనను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని.. అందుకే తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించాడని లావణ్య ఆరోపించింది. ఈ మేరకు నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అలానే మాల్వీ, ఆమె సోదరుడు తనను చంపుతామని బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపించింది. అంతేకాక రాజ్‌ తరుణ్‌ తనకు అబార్షన్‌ కూడా చేయించాడని.. అందుకు సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్స్‌ను, వారిద్దరి ఫొటోలను పోలీసులకు అందించింది లావణ్య.

ఇదిలా ఉండగా తాజాగా లావణ్య మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రాల మధ్య జరిగిన వాట్సాప్‌ మెసేజ్‌లను రివీల్‌ చేసింది. వారిద్దరి మధ్య జరిగిన మెసేజ్‌ చాట్స్‌ లీక్‌ చేసి.. మరిన్ని సంచలన విషయాలు తెర మీదకు తెచ్చింది. దీనిలో రాజ్‌ తరుణ్‌ మాల్వీకి ప్రపోజ్‌ చేయడం ఆమె దానికి అంగీకారం తెలపడం వంటి వివరాలు ఉన్నాయి. అలానే రాజ్‌ తరుణ్‌, మాల్వీల డేట్‌, మీటింగ్‌కు సంబంధించిన వివరాలు కూడా దీనిలో బయటపడ్డాయి. వారిద్దరూ ఏ హోటల్‌ రూమ్స్‌లో కలుసుకున్నారు.. వంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్‌ తరుణ్‌ చెబుతూ రావడంతో ఇప్పుడిలా వారి మధ్య జరిగిన మెసేజ్‌ చాట్స్‌ లీక్‌ కావడం సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి