iDreamPost
android-app
ios-app

ఈ పాప ఓ స్టార్ హీరోయిన్.. ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ

  • Published Jul 05, 2024 | 5:29 PM Updated Updated Jul 05, 2024 | 5:29 PM

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి స్టార్ హీరోయిన్. తాజాగా కాంట్రవర్సీలో చిక్కుకున్న ఓ స్టార్ హీరోకు బెస్ట్ పెయిర్. వీరిద్దరి కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఈ యంగ్ కపుల్స్ బాగా ఆకట్టుకున్నారు. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి స్టార్ హీరోయిన్. తాజాగా కాంట్రవర్సీలో చిక్కుకున్న ఓ స్టార్ హీరోకు బెస్ట్ పెయిర్. వీరిద్దరి కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఈ యంగ్ కపుల్స్ బాగా ఆకట్టుకున్నారు. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Jul 05, 2024 | 5:29 PMUpdated Jul 05, 2024 | 5:29 PM
ఈ పాప ఓ స్టార్ హీరోయిన్.. ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ

ఈ గ్లామర్ ప్రపంచంలో ఎప్పుడు ఏ హీరోయిన్.. ఏ సినిమాతో క్లిక్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. తొలి సినిమాతో మెప్పించలేకపోయినప్పటికీ.. సెకండ్, థర్డ్ చిత్రాలతో స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. ఒక్క మూవీతో ఓవర్ నైట్ హీరోయిన్ అయిపోతుంటారు. కుర్రాళ్ల క్రష్‌గా మారిపోతుంటారు. ఆ తర్వాత యూత్ గుండెల్లో యువరాణిగా స్థిరపడిపోతుంటారు. అలాంటి ఎంతో మంది ముద్దుగుమ్మలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలకు కొదవే ఉండదు. అందంతో పాటు కాస్తంత గ్లామర్ డోస్ ఒలికిస్తే చాలు ఆఫర్లు క్యూ కడుతుంటాయి. ఇదిగో ఈ ఫోటోలో పాప.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్… ఆమెను చూస్తే హబ్బా అని అనుకోవాల్సిందే. తొలి సినిమాతో రాని గుర్తింపు, రెండో చిత్రంతో వచ్చింది.

అక్కడి నుండి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. వరుస పెట్టి సినిమాలు, సిరీస్ చేస్తూ ఉంది. ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా నటించింది. గ్లామర్ పాత్రలు చేయడంలో దిట్ట. లిప్ కిస్‌కు ఏ మాత్రం అడ్డు చెప్పదు. ఆమె తెరపై కనిపిస్తుందంటే చాలు యూత్.. మెస్మరైజ్ అయిపోవాల్సిందే. ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే.. ముంబయి భామ హెబ్బా పటేల్. కన్నడ స్పీకింగ్ ముస్లిం కుటుంబంలో పుట్టిన హెబ్బా.. విద్యాభ్యాసం ముంబయిలో పూర్తి చేసింది. 2014లో అధ్యక్ష అనే మూవీతో చందన సీమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. వెంటనే తమిళంలో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాహుల్ రవీంంద్రన్ అలా ఇలా మూవీలో యాక్ట్ చేసింది. ఇందులో శృతి పాత్రలో సెకండ్ హీరోయిన్‌లా కనిపిస్తుంది కానీ ఆమె చివరకు మెయిన్ హీరోయిన్ అవుతుంది.

ఇందులో అంత గుర్తింపు రాలేదు కానీ.. కుమారి 21 ఎఫ్‌తో ఒక్కసారిగా క్లిక్ అయ్యింది. ప్రియుడికి నచ్చినట్లు ఉండమని చెప్పే ప్రియురాలి పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో ఆమె నటనకు పడిపోయారు యూత్. అలా తెలుగు కుర్రాళ్ల క్రష్ అయ్యింది. అక్కడ నుండి వరుస పెట్టి సినిమాలు చేసింది. రాజ్ తరుణ్ కు బెస్ట్ పెయిర్ అయ్యింది. వీరిద్దరు మూడు చిత్రాలకు పైగా కలిసి నటించారు.  తెలుగులో వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది. ఈడోరకం, ఆడో రకం, నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిసెస్, ఒరేయ్ బుజ్జీ, రెడ్, ఓదెలా రైల్వే స్టేషన్, ద గ్రేట్ ఇండియన్ సూసైట్, వెయ్ దరువేయ్ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం గ్లామరే కాదు డీ గ్లామర్ రోల్ కూడా చేస్తానని ఓదెల మూవీతో నిరూపించింది. మస్తీ, వ్యవస్థ వెబ్ సిరీస్ చేసింది. స్పెషల్ సాంగ్స్‌లో కూడా ఆడిపాడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. అందులో రెండు తమిళం కాగా, ఓదెలా 2లో నటిస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet