iDreamPost
android-app
ios-app

ముచ్చటగా మూడో భార్యకు విడాకులు ఇవ్వనున్న బుల్లితెర స్టార్!

  • Author ajaykrishna Published - 01:02 PM, Mon - 31 July 23
  • Author ajaykrishna Published - 01:02 PM, Mon - 31 July 23
ముచ్చటగా మూడో భార్యకు విడాకులు ఇవ్వనున్న బుల్లితెర స్టార్!

సెలబ్రిటీ హోదా వచ్చాక లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చేస్తాయి. ఉండాల్సిన వాటికీ.. ఉంచుకోవాల్సిన వాటికీ తేడా తెలియకుండా పోతుంది. ఆన్నింటిని ఒకేలా ట్రీట్ చేయడం మొదలు పెడతారు. అందులో రిలేషన్ షిప్స్ కూడా విలువ లేకుండా అయిపోతాయి. జనరల్ గా ఎవరి లైఫ్ లో అయినా పెళ్లి అనేది ఎంతో స్పెషల్. లైఫ్ లో ఒక్కసారి మాత్రమే అవుతుందని.. ఆ బంధాన్ని చివరి వరకు కాపాడుకోవాలని అనుకుంటారు. కానీ.. సెలబ్రిటీస్ లో అలా కాదు. పెళ్లి అయ్యాక వాళ్ల లివింగ్ స్టైల్ పై.. వాళ్లే నమ్మకం కోల్పోతారు. కట్ చేస్తే.. ఇద్దరు విడిపోవడానికి.. అంటే విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోతారు. తాజాగా ఓ బుల్లితెర స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏకంగా మూడో భార్యకు విడాకులకు సిద్ధం అయిపోయాడు.

ఆ వివరాల్లోకి వెళ్తే.. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌, బుల్లితెర స్టార్ అయిన రాహుల్‌ మహాజన్‌.. తన 48 ఏళ్ల వయసులో మూడోసారి విడాకులకు రెడీ అయ్యాడు. తన భార్య ఖజకిస్తాన్‌ మోడల్‌ నటల్య ఇలినాతో కలిసి ఏడాది క్రితమే విడాకులకు దరఖాస్తు చేశాడు. ఈ విషయం కాస్త లేటుగా బయటపడింది. 2019లో రాహుల్.. ఖజకిస్తాన్ కి చెందిన మోడల్ నటల్య ఇలీనాని పెళ్లి చేసుకున్నాడు. మొదటి నుండి మనస్పర్థల మధ్యే ఇద్దరు నాలుగేళ్లు మ్యారేజ్ లైఫ్ ని సాగదీసుకొచ్చారు. కలిసి ఉందామని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోవడంతో.. కలిసుండి గొడవలు పడటం కంటే విడిపోవడం మేలు అని నిర్ణయించుకున్నారట. కట్ చేస్తే.. ఇద్దరు ఏడాది కిందటే విడాకులకు రెడీ అయిపోయారని సమాచారం.

ఇక రాహుల్ – నటల్యలకు విడాకులు మంజూరు అయ్యాయా లేదా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. రాహుల్ మహాజన్.. ఎవరో కాదు మాజీ కేబినెట్ మినిస్టర్ ప్రమోద్ మహాజన్ కుమారుడు. 2008లో బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న రాహుల్.. అప్పటికి రెండేళ్ల క్రితమే అంటే 2006లో శ్వేతా సింగ్ ని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహ బంధం సెట్ అవ్వక రెండేళ్లకు విడిపోయారు. ఆ తర్వాత.. ఓ రియాలిటీ షో ద్వారా డింపి గంగూలీతో పరిచయమై.. కొన్నిరోజులకు ఆమెతో లవ్ లో పడ్డాడు. 2010లో ఇద్దరికీ పెళ్లి అయ్యింది. కానీ.. ఆమెతో కూడా మ్యారేజ్ లైఫ్ సెట్ కాలేదని.. 2015లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటల్యతో 2019లో పెళ్లి జరిగింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఆమెతో కూడా డివోర్స్ కి రాహుల్ రెడీ. ప్రస్తుతం రాహుల్ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే మూడ్ లో లేడట. మరి రాహుల్ మహాజన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom