iDreamPost
android-app
ios-app

Raghavendra Movie: రాఘవేంద్ర మూవీ సెకండ్ హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?

  • Published Dec 21, 2023 | 8:36 PM Updated Updated Dec 21, 2023 | 8:36 PM

సలార్ మూవీతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాడు ప్రభాస్. అయితే డార్లింగ్.. తొలి నాళ్లలో విభిన్న కథ చిత్రాల్లో నటించాడు. వాటిల్లో ఒకటి రాఘవేంద్ర. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అమ్మాయి గుర్తుందా..?

సలార్ మూవీతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాడు ప్రభాస్. అయితే డార్లింగ్.. తొలి నాళ్లలో విభిన్న కథ చిత్రాల్లో నటించాడు. వాటిల్లో ఒకటి రాఘవేంద్ర. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అమ్మాయి గుర్తుందా..?

  • Published Dec 21, 2023 | 8:36 PMUpdated Dec 21, 2023 | 8:36 PM
Raghavendra Movie: రాఘవేంద్ర మూవీ సెకండ్ హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాదూ గ్లోబల్ స్టార్. సలార్ మూవీతో బాక్సాఫీస్ దున్నేసేందుకు సిద్ధమౌతున్నాడు. డిసెంబర్ 21 అర్థరాత్రి నుండి థియేటర్లు దద్దరిల్లబోతున్నాయి. ఆరున్నరేళ్లుగా ప్రభాస్.. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈశ్వర్ మూవీ నుండి మొదలైన అతడి కెరీర్.. బాహుబలికి ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా ఉంటుంది. అంతకు ముందు హిట్ మూవీస్ లేవా అంటే చాలానే ఉన్నాయి. అలాగే ప్లాప్స్ పలకరించాయి. అటువంటి మూవీల్లో ఒకటి రాఘవేంద్ర. ఈ మూవీలో కోపిస్టిగా, మరో కోణంలో శాంతియుతంగా డిఫరెంట్ రోల్స్‌లో కనిపిస్తున్నాడు. ఈ మూవీలో ఇద్దరు భామలు నటించారు.

వారిలో ఒకరు మన్మధుడు హీరోయిన్ అన్షు, కాగా.. సెకండ్ హీరోయిన్ పాత్రను పోషించింది శ్వేతా అగర్వాల్. ఈ శ్వేతా అగర్వాల్ తెలుగు సినిమా ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రవిబాబు అల్లరి మూవీలో నరేష్ ను ప్రేమించే అప్పు క్యారెక్టర్ చేసింది ఈ నటినే. స్టార్ హీరోల పక్కన చేసినప్పటకీ.. కేవలం 7-8 సినిమాలే చేసి.. తెరమరుగైంది. అల్లరి తర్వాత సుదీప్ మూవీ కిచ్చాలో నటించింది. ఈ మూవీతోనే అతడికి కిచ్చా సుదీప్ అనే ముద్ర పడింది. మలయాళంలో సీఐడీ మూసాలో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. అలాగే రాఘవేంద్ర మూవీలో ప్రభాస్ మరదలి పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత గమ్యం మూవీలో ఓ ప్రత్యేక పాటలో కనిపించింది.

swetha agarwal

ఇక బాలీవుడ్ లో షాపిట్ అనే హారర్ మూవీ చేసింది. ఆ మూవీ హీరోగా చేసిన ఆదిత్య నారాయణ్‌తో ప్రేమలో పడి.. వివాహం చేసుకుంది. ఆదిత్య మరెవ్వరో కాదూ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు. అంటే శ్వేతా ఉదిత్ నారాయణ్ ఇంటి కోడలు. వీరికి ఓ పాప. ఆదిత్య నటుడే కాదూ సింగర్, హోస్ట్ కూడా. ఇక శ్వేతా అగర్వాల్ సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తే.. కాస్త బొద్దుగా కనిపిస్తుంది కానీ .. అందం ఏమాత్రం తగ్గలేదు. అలాగే భర్త, మామకు సంబంధించిన కాన్సర్ట్ వివరాలు షేర్ చేస్తూ ఉంటుంది. మరీ ఇప్పుడు ఆ బబ్లీ గర్ల్ ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Tarveen (@thelooneylens)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet