iDreamPost
android-app
ios-app

Raghava Lawrence: మంచి మనసు చాటుకున్న లారెన్స్! వారందరికీ సాయం!

  • Author Soma Sekhar Published - 12:04 PM, Sun - 3 December 23

జిగర్ తండా: డబుల్ ఎక్స్ సినిమా భారీ విజయం సాధించడంతో అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రకటించాడు హీరో రాఘవ లారెన్స్. దీంతో లారెన్స్ గొప్ప మనసుపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

జిగర్ తండా: డబుల్ ఎక్స్ సినిమా భారీ విజయం సాధించడంతో అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రకటించాడు హీరో రాఘవ లారెన్స్. దీంతో లారెన్స్ గొప్ప మనసుపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • Author Soma Sekhar Published - 12:04 PM, Sun - 3 December 23
Raghava Lawrence: మంచి మనసు చాటుకున్న లారెన్స్! వారందరికీ సాయం!

హీరోలు, హీరోయిన్ లు తమ అభిమానులకు సాయం చేయడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఈ వరుసలో ముందుంటాడు రాఘవ లారెన్స్. తన సినిమా రిలీజ్ అయిన ప్రతీ సారి అభిమానులకు ఎంతో కొంత సాయం చేస్తూ.. గొప్ప మనసును చాటుకుంటూ ఉంటాడు. తాజాగా మరోసారి అభిమానులకు భారీ గిఫ్ట్ ప్రకటించాడు. ఇటీవలే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండా: డబుల్ ఎక్స్ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రంలో లారెన్స్, ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్, కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు రాఘవ లారెన్స్.

‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’.. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. జిగర్ తండకు సీక్వెల్ గా యాక్షన్, కామెడీ చిత్రంగా వచ్చి.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. కాగా.. ఈ మూవీ భారీ వసూళ్లను కూడా సాధించింది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్ ను చెన్నైలో నిర్వహించింది చిత్ర బృందం. ఈ వేడుకలో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇస్తున్నట్లు తెలిపాడు. సక్సెస్ మీట్ లో లారెన్స్ మాట్లాడుతూ..”జిగర్ తండ:డబుల్ ఎక్స్ మూవీ నాకు మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాకు దేవుడు ఆశీస్సులతో పాటుగా ప్రేక్షకుల ప్రోత్సాహం ఉంది. వారి అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను, వారందరూ నా కుటుంబ సభ్యులే . ఇక ఈ సినిమాకు అసలైన హీరో కార్తీక్ సుబ్బరాజు అని నా మనసులో ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు లారెన్స్.

కాగా.. సినిమా విడుదలైన ప్రతీసారి నా ఫ్యాన్స్ కు ఏదో ఒకటి చేయాలనుకుంటాను, అందుకే ఈసారి మా అమ్మ పేరు మీద కన్మణి కళ్యాణ మండపాన్ని త్వరలో నిర్మించబోతున్నట్లు లారెన్స్ తెలిపాడు. ఈ మండపంలో నా అభిమానులు ఉచితంగా పెళ్లి చేసుకోవచ్చని ఈ సందర్భంగా వెల్లడించాడు. మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న లారెన్స్ పై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓ అభిమాని పెళ్లికి పిలవడానికి వచ్చిన సందర్భంలో తనకు పెళ్లి చేసుకోవడానికి సరైన వసతి లేదని చెప్పడంతో బాధేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు లారెన్స్ వివరించాడు. ఈ కళ్యాణ మండంలో వంట పాత్రలతో సహా అన్నీ ఉంటాయని, వాటికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ఉచితంగా వివాహం చేసుకోవచ్చని లారెన్స్ వివరించాడు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు లారెన్స్. ఇదిలా ఉండగా నెట్ ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి లారెన్స్ మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom