iDreamPost
android-app
ios-app

Raghava Lawrence: టీచర్ ఇంటికి వెళ్లిన కోలీవుడ్ స్టార్ హీరో లారెన్స్ .. ఎందుకంటే !

  • Published Jul 14, 2024 | 6:00 PM Updated Updated Jul 14, 2024 | 6:00 PM

నటుడు లారెన్స్ సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా.. సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎన్నో వీడియోస్ ను చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నటుడు లారెన్స్ సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా.. సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎన్నో వీడియోస్ ను చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  • Published Jul 14, 2024 | 6:00 PMUpdated Jul 14, 2024 | 6:00 PM
Raghava Lawrence: టీచర్ ఇంటికి వెళ్లిన కోలీవుడ్ స్టార్ హీరో లారెన్స్ .. ఎందుకంటే !

కోలీవుడ్ స్టార్ హీరో లారెన్స్.. నటన కంటే ముందు ఇతను డ్యాన్స్ కు పెట్టింది పేరు. ఇతని డ్యాన్స్ కు ఫిదా అవ్వని వారు ఉండరు. ఇక ఈ హీరో నటించిన సినిమాలన్నీ కూడా హిట్స్ గానే నిలిచాయి. ఇలా ఓ వైపు సినిమాలో బిజీగా ఉంటూనే.. మరో వైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు లారెన్స్. ఇప్పటికే దానికి సంబంధించిన ఎన్నో వీడియోస్ ను , వార్తలను చూస్తూనే ఉన్నాము. ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి.. అందరికి సహాయం చేస్తున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు లారెన్స్ కు సంబంధించిన మరొక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

ఈసారి సోషల్ మీడియాలో లారెన్స్ కు సంబంధించి.. వైరల్ అవుతున్న వీడియో ఏదంటే.. ఆయన స్వయంగా ఓ డ్రాయింగ్ టీచర్ ఇంటికి వెళ్లి మరీ కలిసి అభినందించారు. ఆ డ్రాయింగ్ టీచర్ కనీసం లారెన్స్ కు విద్య నేర్పించిన వారు కూడా కాదు. కేవలం లారెన్స్ సోషల్ మీడియాలో అతను వేసిన డ్రాయింగ్స్ చూసి.. మురిసిపోయి.. స్వయంగా వెళ్లి కలిసి అభినందించారు లారెన్స్. ఆ డ్రాయింగ్ టీచర్ ను కలవడం చాలా సంతోషంగా ఉందంటూ.. అతను ఇచ్చిన బహుమతి తన మనసుకు హత్తుకుంది.. లారెన్స్ ఆనందం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు ఎటువంటి సంబంధం లేకపోయినా సరే.. లారెన్స్ అతని ఇంటికి వెళ్లి కలిసి ప్రశంసించడం.. అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇలా ఇప్పటివరకు లారెన్స్ ఎంతో మంది మనసులకు హాయి కలిగించే పనులను చేశారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లారెన్స్. ఇంత ఎదిగిన కూడా తన ఎక్కడినుంచి వచ్చారనేది.. మర్చిపోకుండా.. తనకు తోచిన సహాయం చేస్తూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు , తమిళం అని తేడా లేకుండా వచ్చిన ఆఫర్స్ ను అందిపుచ్చుకుని.. అందరికి ఫేవరేట్ హీరోగా నిలిచిపోయారు లారెన్స్. ఇక ప్రస్తుతం విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న గోట్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు లారెన్స్ . కాగా తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదలకు , విద్యార్థులకు సహాయం చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, టూ వీలర్స్ కూడా అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే లారెన్స్ ఇప్పటికి లెక్కలెన్నని సామాజిక సేవ కార్యక్రమాలు చేశారు. ఇక ఈ సారి కేవలం సోషల్ మీడియా లో డ్రాయింగ్స్ చూసి.. స్వయంగా అతని ఇంటికి వెళ్లి అభినందించడం అనేది విశేషం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş