iDreamPost
android-app
ios-app

ఫ్యాన్‌కు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన లారెన్స్‌!

  • Published Nov 05, 2023 | 11:39 AM Updated Updated Nov 05, 2023 | 11:39 AM

దర్శకుడిగా.. నటుడిగా.. డ్యాన్స్‌ కొరియో గ్రాఫర్‌గా ఇలా పలు రకాలుగా తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం నటనపై ఎక్కువ దృష్టి పెట్టారాయన. ఆయన నటించిన తాజా చిత్రం

దర్శకుడిగా.. నటుడిగా.. డ్యాన్స్‌ కొరియో గ్రాఫర్‌గా ఇలా పలు రకాలుగా తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం నటనపై ఎక్కువ దృష్టి పెట్టారాయన. ఆయన నటించిన తాజా చిత్రం

  • Published Nov 05, 2023 | 11:39 AMUpdated Nov 05, 2023 | 11:39 AM
ఫ్యాన్‌కు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన లారెన్స్‌!

టాలెంట్‌ ఉన్నవారికి సినిమా ఇండస్ట్రీ ఓ కల్పతరువు లాంటిది. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా వెనకడుగువేయకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పోతే ఉ‍న్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అతి చిన్న స్థాయి నుంచి వచ్చిన వారు పెద్ద పెద్ద స్టార్లుగా మారిన సందర్బాలు చిత్ర పరిశ్రమలో చాలానే ఉన్నాయి. అలా చిన్న స్థాయినుంచి అసమాన స్థాయికి ఎదిగిన వారిలో రాఘవా లారెన్స్‌ ఒకరు. సైడ్‌ డ్యాన్సర్‌గా సినిమా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన ఇప్పుడు పెద్ద స్టార్‌గా మారారు.

దర్శకుడిగా.. నటుడిగా.. డ్యాన్స్‌ కొరియో గ్రాఫర్‌గా ఇలా పలు రకాలుగా తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం నటనపై ఎక్కువ దృష్టి పెట్టారాయన. ఆయన నటించిన తాజా చిత్రం ‘ జిగిరితాండ డబుల్‌ ఎక్స్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు  రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో లారెన్స్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టేజిపై మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో ఓ అభిమాని స్టేజిమీదకు దూసుకెళ్లాడు.

లారెన్స్‌ కాళ్లపై పడబోయాడు. లారెన్స్‌ అభిమానిని తన కాళ్లపై పడకుండా ఆపాడు. ఆ వెంటనే ఆయనే ఫ్యాన్‌ కాళ్లకు దండం పెట్టారు. దీంతో అక్కడనున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. తన దగ్గరికి వచ్చిన ఆ అభిమానితో లారెన్స్‌ ఎంతో ప్రేమగా మాట్లాడారు. లారెన్స్‌ తల్లికి గుడి కట్టాడాన్ని స్పూర్తిగా తీసుకుని, ఆ అభిమాని తన గుండెలపై తల్లి పచ్చ బొట్టు వేయించుకున్నానని చెప్పాడు. దీంతో లారెన్స్‌ ఎంతో సంతోషించారు. అభిమానిని గట్టిగా హత్తుకుని గుండెలపై ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom