iDreamPost
android-app
ios-app

వీడియో: దీనస్థితి.. ముగ్గురు కుమార్తెలతో మహిళ! దేవుడిలా ఆదుకున్న లారెన్స్‌!

  • Published Mar 30, 2024 | 2:01 PM Updated Updated Mar 30, 2024 | 2:01 PM

ప్రముఖ సినీ నర్తకుడు.. లారెన్స్ అటు సినిమాలలో ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో .. సమాజానికి సేవ చేసే విషయంలోనూ అంతే గుర్తింపు తెచ్చుకున్నారో.. ఈ క్రమంలో ఆయనను ఆదర్శంగా తీసుకుని ఓ కమెడియన్ ఓ కుటుంబానికి చేసిన సహాయానికి సంబంధించిన వీడియో.. ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రముఖ సినీ నర్తకుడు.. లారెన్స్ అటు సినిమాలలో ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో .. సమాజానికి సేవ చేసే విషయంలోనూ అంతే గుర్తింపు తెచ్చుకున్నారో.. ఈ క్రమంలో ఆయనను ఆదర్శంగా తీసుకుని ఓ కమెడియన్ ఓ కుటుంబానికి చేసిన సహాయానికి సంబంధించిన వీడియో.. ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  • Published Mar 30, 2024 | 2:01 PMUpdated Mar 30, 2024 | 2:01 PM
వీడియో: దీనస్థితి.. ముగ్గురు కుమార్తెలతో మహిళ! దేవుడిలా ఆదుకున్న లారెన్స్‌!

రాఘవ లారెన్స్.. ఇండస్ట్రీలో ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా డాన్స్ కు పెట్టింది పేరు లారెన్స్ మాస్టర్. సినీ ప్రపంచంలో హీరోగా, దర్శకుడిగా, డ్యాన్స్ మాస్టర్ గా రాఘవ లారెన్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాగే, తెర వెనుక సమాజంలో కూడా.. ఎన్నో ఛారిటబుల్ ట్రస్ట్స్ ను కొనసాగిస్తూ.. ఎంతో మందికి సహాయం చేస్తూ.. ఎందరో పేద ప్రజల హృదయాలలో .. చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు రాఘవ లారెన్స్. ఈయన చేసిన సహాయాలు గురించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం. ఇక ఇప్పుడు తాజాగా లారెన్స్ మాస్టర్ ను ఆదర్శంగా తీసుకుని.. కేపీవై బాల అనే కమెడియన్ నిరు పేదలకు చేస్తున్న సహాయాలు.. కోలీవుడ్ లో సెన్సేషన్ గా మారడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఆశక్తికరంగా మారాయి.

చాలా మంది తమ అభిమాన హీరోల గురించి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. కానీ, కేవలం కొంతమంది మాత్రమే.. వారిని ఆదర్శంగా తీసుకుని వారి బాటలో కొనసాగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే బాల అనే కమెడియన్ కోలీవుడ్ లో సెన్సేషన్ గా మారాడు. కోలీవుడ్ లో ఒక చిన్న కామెడీ షో ద్వారా ఇతను తెరపైన కనిపించాడు. ఈ క్రమంలోనే అతని నటనకు మంచి గుర్తింపు రావడంతో.. సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు. ఇలా తనకు వచ్చిన సంపాదనను నిరుపేదలకు సహాయం చేసేందుకు ఉపయోగిస్తున్నాడు ఈ వ్యక్తి. తన అభిమాన హీరో లారెన్స్ అని.. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇప్పటివరకు ఎన్నో .. సేవ కార్యక్రమాలు చేశానంటూ చెప్పుకొచ్చాడు కేపీవై బాల. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ నిరుపేద మహిళకు సహాయం చేయగా.. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీరిద్దరూ కలిసి సహాయం చేసిన మహిళ పేరు మురుగమ్మాల్ . ఈమె తమిళ నాడుకు చెందిన మహిళ.. ఈమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే పెళ్ళైన కొన్నాళ్లకే ఈమె తన భర్తను కోల్పోవడంతో.. బ్రతుకు బండిని సాగించడం కష్టతరంగా మారింది. తన కుమార్తెలను పోషించుకునేందుకు చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది. ఆమెకు ఆటో నడపడం వచ్చినా కూడా.. దానిని కొనే స్థోమత లేక ఆగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బాల ఆమె పరిస్థితిని లారెన్స్ దృష్టికి తీసుకుని వెళ్ళాడు. దీనితో లారెన్స్ వెంటనే స్పందించి రూ.3 లక్షల రూపాయలతో ఆమెకు ఆటోను కొనిచ్చారు. ఇలా వీరిద్దరూ కలిసి ఆమె కష్టానికి అండగా నిలబడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా కేపీవై బాల ఇప్పటికే ఎంతో మంది నిరుపేదలకు సహాయం చేస్తూ.. వారికీ అండగా నిలబడ్డాడు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş