iDreamPost
android-app
ios-app

త్వరలో రాధ కూతురు పెళ్లి.. స్టార్లకు అందుతున్న ఆహ్వానాలు!

  • Published Nov 09, 2023 | 8:32 AM Updated Updated Nov 09, 2023 | 8:32 AM

రాధ కూతురు ప్రముఖ హీరోయిన్‌ కార్తీక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే కార్తీక ఎంగేజ్‌మెంట్‌ జరిగిపోయింది. అతి త్వరలో పెళ్లి జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరావేగంగా సాగుతున్నాయి.

రాధ కూతురు ప్రముఖ హీరోయిన్‌ కార్తీక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే కార్తీక ఎంగేజ్‌మెంట్‌ జరిగిపోయింది. అతి త్వరలో పెళ్లి జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరావేగంగా సాగుతున్నాయి.

  • Published Nov 09, 2023 | 8:32 AMUpdated Nov 09, 2023 | 8:32 AM
త్వరలో రాధ కూతురు పెళ్లి.. స్టార్లకు అందుతున్న ఆహ్వానాలు!

అలనాటి అందాల తార రాధ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 1980-90లలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందారు. దాదాపు వంద సినిమాల్లో నటించారు. తెలుగులో స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించారు. ఆమె 1981లో వచ్చిన ‘ అలైగల్‌ ఓవత్తిలయ్‌’ అనే తమిళ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత 1983లో శక్తి అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఎన్‌టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, క్రిష్ణం రాజు, శోభన్‌ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ ఇలా అందరితోనూ సినిమాలు చేశారు.

1991లో రాజశేఖర్‌ నాయర్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో కార్తీక, తులసిలు తల్లి రాధ బాటలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కార్తీక 2009లో వచ్చిన తెలుగు సినిమా జోష్‌తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా నటించారు. ఈ సినిమా నాగచైతన్యకు కూడా మొదటి సినిమా కావటం విశేషం. అయితే, ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద చతికిల పడింది. అయినప్పటికి కార్తీకకు ఆఫర్లు తగ్గలేదు. 2011లో కో అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో జీవాకు జంటగా నటించారు. పొలిటికల్‌ క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు కేవీ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో ‘రంగం’ పేరిట విడుదలైంది. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2012లో కార్తీక.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి దమ్ము సినిమాలో నటించారు. జూ.ఎన్టీఆర్‌కు చెల్లెలిగా చేశారు. ఆ తర్వాత 2014లో ‘‘ బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి’’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఏ సినిమా చేయలేదు. 2015లో తమిళంలో ‘ పురంపోక్కు అంగిర పుదుఉదమై’’ సినిమా తర్వాత సినిమాలనుంచి తప్పుకున్నారు. 2017లో హిందీలో ఓ టీవీ షో చేశారు.

తర్వాత నటనా రంగం నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి కొడుకు వివరాలు అయితే బయటకు రాలేదు. గత అక్టోబర్‌ నెలలో కార్తీక ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. మరికొద్దిరోజుల్లో పెళ్లి కూడా జరగబోతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు శరావేగంగా జరుగుతున్నాయి. రాధ సెలెబ్రిటీలకు ఆహ్వానాలు పంచుతున్నారు. తాజాగా, ప్రముఖ సీనియర్‌ దర్శకుడు కే రాఘవేంద్ర రావును రాధ కలిశారు. ఆయన్ని పెళ్లికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, కార్తీక పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Radha (@radhanair_r)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş