iDreamPost
android-app
ios-app

పుష్ప పార్ట్ 2 ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే.. ?

  • Published Nov 11, 2024 | 11:51 AM Updated Updated Nov 11, 2024 | 11:51 AM

Pushpa 2 : ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్ అంతా పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో అంతా ఈ మూవీ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది ఊహించని ప్లేస్ లో జరగనున్నట్లు టాక్ నడుస్తుంది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

Pushpa 2 : ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్ అంతా పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో అంతా ఈ మూవీ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది ఊహించని ప్లేస్ లో జరగనున్నట్లు టాక్ నడుస్తుంది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

  • Published Nov 11, 2024 | 11:51 AMUpdated Nov 11, 2024 | 11:51 AM
పుష్ప పార్ట్ 2 ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే.. ?

మూడేళ్ళ క్రితం పుష్ప 1 ప్రేక్షకులలో గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అప్పటినుంచి కూడా పుష్ప 2 మీద ఆసక్తి నెలకొంది. ఇక ఎప్పుడైతే పుష్ప 2 నుంచి అప్డేట్స్ రావడం మొదలయ్యాయో.. అప్పటినుంచి ఆసక్తితో పాటు అంచనాలు కూడా పెరిగాయి. ఇక ఇప్ప్పుడు ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సినిమా ఏదంటే.. మరో ఆలోచన లేకుండా పుష్ప 2 అని ఈజీగా చెప్పేయొచ్చు. ఆ రేంజ్ లో పుష్ప 2 మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అభిమానులలో క్యూరియాసిటి పెరుగుతూ ఉంది. అయితే ఓ వైపు షూటింగ్ పనులు బ్యాలెన్స్ ఉండడంతో.. కాస్త ట్రోల్ అవుతున్న మాట వాస్తవమే. కానీ ఒక్కసారి ట్రైలర్ రీలిజ్ అయితే మాత్రం ట్రోల్ కాస్త ట్రెండ్ గా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులంతా కూడా ట్రైలర్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రైలర్ కట్ రెడీ అయినా విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట మేకర్స్. సినిమా విడుదలకు రెండు వారాల ముందు అంటే సరిగ్గా నవంబర్ 20న ట్రైలర్ లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ ట్రైలర్ ను మాత్రం ముందే రెడీ చేసిపెట్టేశాడు సుకుమార్. కొన్ని రోజుల పాటు ఎడిటింగ్ మీదే కూర్చుని బెస్ట్ షార్ట్స్ , డైలాగ్స్ తో బ్లాస్ట్ అయ్యే అవుట్ పుట్ ను తీరిచిదిద్దినట్టు సమాచారం. అయితే ఇండియాలోని వేరు వేరు నగరాల్లో ఒకేసారి టీజర్ లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నారట.. అదే సమయంలో థియేటర్స్ లో ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నట్లు టాక్. ట్రైలర్ కంటే ముందే షూట్ ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మాత్రం అది జరిగేలా లేదు. కొత్త టాకీ పార్ట్ మిగులుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బన్నీ శ్రీలీల మీద ఐటెం సాంగ్ ను చిత్రీకరించే పనిలో ఉన్నారు టీం.

ఐటెం సాంగ్ మీద కూడా ప్రేక్షకులు చాలా అంచనాలు పెంచుకున్నారు . ఎందుకంటే పార్ట్ 1 లో ఐటెం సాంగ్ సినిమాకు పెద్ద ఎసెట్. కాబట్టి ఈసారి సాంగ్ దానికంటే హైలెట్ గా ఉంటేనే.. పార్ట్ 2 కు ప్లస్ అవుతుంది. మరి ఈసారి శ్రీలీల .. సామ్ ను మరపిస్తుందో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక అటు ప్రమోషన్స్ సంగతి సరే సరి. అదిగో ఇదిగో అంటున్నారు.. స్టార్ క్రికెటర్స్ అంటున్నారు.. కానీ ఇంతవరకు ఆ హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. ఈ సినిమా ఏ మేరకు అంచనాలను అందుకుంటుందో తెలియదు కానీ.. రిలీజ్ కాకుండానే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక రానున్న అప్డేట్స్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet