iDreamPost
android-app
ios-app

పుష్పరాజ్ కొత్త స్ట్రాటజీ.. అక్కడ 2 వారాల ముందే పుష్ప రిలీజ్..!

  • Published Nov 12, 2024 | 4:28 PM Updated Updated Nov 12, 2024 | 4:28 PM

Pushpa Update: ఈ నవంబర్ 17 న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. చాలా గ్రాండ్ గా ఈ ఈవెంట్ జరగబోతుంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ఈ మెగా ఈవెంట్స్ ను ఎరేంజ్ చేశారు. ఇంత పీక్ మూమెంట్ లో ఇప్పుడు పుష్ప మూవీని రీరిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

Pushpa Update: ఈ నవంబర్ 17 న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. చాలా గ్రాండ్ గా ఈ ఈవెంట్ జరగబోతుంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ఈ మెగా ఈవెంట్స్ ను ఎరేంజ్ చేశారు. ఇంత పీక్ మూమెంట్ లో ఇప్పుడు పుష్ప మూవీని రీరిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

  • Published Nov 12, 2024 | 4:28 PMUpdated Nov 12, 2024 | 4:28 PM
పుష్పరాజ్ కొత్త స్ట్రాటజీ.. అక్కడ 2 వారాల ముందే పుష్ప రిలీజ్..!

అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ సినిమా గ్రాండ్ గా డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మొదటి రోజే 270 కోట్లు కొల్లగొడుతుందని అంచనా. దాదాపు అన్ని భాషల్లోనూ హౌస్ ఫుల్ షోస్ పడతాయని భావిస్తున్నారు మేకర్స్. సినిమాలోనే కాకుండా సినిమా ప్రమోషన్స్ లోను క్రియేటివిటీ , కొత్త స్ట్రాటజిలను ఫాలో అవుతున్నారు. ఈ నవంబర్ 17 న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. చాలా గ్రాండ్ గా ఈ ఈవెంట్ జరగబోతుంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ఈ మెగా ఈవెంట్స్ ను ఎరేంజ్ చేశారు. మొత్తానికి సినిమాను పబ్లిక్ లోకి పంపించడానికి.. ఎన్ని ఏర్పాట్లు జరగాలో అన్ని జరుగుతున్నాయి.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇంత పీక్ మూమెంట్ లో ఇప్పుడు పుష్ప మూవీని రీరిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. అది కూడా ఇక్కడ కాదు యూఎస్ లో. పుష్ప 2 కి మరింత హైప్ తీసుకురావడానికి ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మేకర్స్. పుష్ప 2 కి భారీ హైప్ ఉంది కాబట్టి.. కచ్చితంగా ఆడియన్స్ మరోసారి పుష్ప సినిమా చూడడానికి వస్తారని అనుకుంటున్నారు. ఈ రీరిలీజ్ వలన పుష్ప 2 కి పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకంటే నిజానికి అల్లు అర్జున్ కి యూఎస్ లో అంత మార్కెట్ లేదు. అయినా సరే పుష్ప పార్ట్ 1 అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. అందుకే ఈసారి ఏకంగా 20+ మిలియన్ డాలర్స్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది.

ఈ టార్గెట్ ని అందుకోవాలంటే ప్రమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే ఇప్పుడు పుష్ప సినిమాను రీరిలీజ్ చేస్తున్నారని టాక్. పుష్ప పార్ట్ 1 నవంబర్ 19న రీరిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రీరిలీజ్ అయ్యే అన్ని థియేటర్స్ లో పుష్ప 2 ట్రైలర్ ను ప్రదర్శించనున్నట్లు సమాచారం. దీని ద్వారా పుష్ప 2 కి స్కోప్ బాగా దొరుకుతుంది. ఈ సినిమాతో ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలనే లక్ష్యంతో మేకర్స్ ఉన్నారు. ఇప్పటికే సినిమా రైట్స్ ను అన్ని భాషలలో భారీ ధరలకు అమ్మేసారు. అది రాబట్టాలంటే థియేటర్స్ లో ఈ సినిమా లాంగ్ రన్ మైంటైన్ చేయాలి. ఇప్పటికే దేశంలో అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ టైం లో పుష్ప రీరిలీజ్ ఎంతో కొంత ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler