iDreamPost
android-app
ios-app

పాన్ ఇండియా సినిమాలకు రోల్ మోడల్ గా పుష్ప 2

  • Published Nov 26, 2024 | 4:29 PM Updated Updated Nov 26, 2024 | 4:29 PM

Pushpa 2 Updates: ఒక సినిమాకు కోట్ల బడ్జెట్ కేటాయించడం ఒకెత్తయితే.. దానిని వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం మరొక ఎత్తు. ఆ ప్రమోషన్స్ ప్లాన్ చేయడం అతి పెద్ద సవాల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని గుర్తించి తూచా తప్పకుండ ప్లాన్డ్ గా అమలు చేశారు కాబట్టే రాజమౌళికి దేశవ్యాప్తంగా అంత బ్రాండ్ పెరిగింది.

Pushpa 2 Updates: ఒక సినిమాకు కోట్ల బడ్జెట్ కేటాయించడం ఒకెత్తయితే.. దానిని వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం మరొక ఎత్తు. ఆ ప్రమోషన్స్ ప్లాన్ చేయడం అతి పెద్ద సవాల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని గుర్తించి తూచా తప్పకుండ ప్లాన్డ్ గా అమలు చేశారు కాబట్టే రాజమౌళికి దేశవ్యాప్తంగా అంత బ్రాండ్ పెరిగింది.

  • Published Nov 26, 2024 | 4:29 PMUpdated Nov 26, 2024 | 4:29 PM
పాన్ ఇండియా సినిమాలకు రోల్ మోడల్ గా పుష్ప 2

ఒక సినిమాకు కోట్ల బడ్జెట్ కేటాయించడం ఒకెత్తయితే.. దానిని వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం మరొక ఎత్తు. ఆ ప్రమోషన్స్ ప్లాన్ చేయడం అతి పెద్ద సవాల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని గుర్తించి తూచా తప్పకుండ ప్లాన్డ్ గా అమలు చేశారు కాబట్టే రాజమౌళికి దేశవ్యాప్తంగా అంత బ్రాండ్ పెరిగింది. ఆర్ఆర్ఆర్ టైం లో ఇద్దరు హీరోలతో హైదరాబాద్ నుంచి ముంబై వరకు తిరిగి విపరీతంగా పబ్లిసిటీ పెంచుకున్నారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో కూడా వీరికి విపరీతమైన క్రేజ్ లభించింది. సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నా సరే.. సినిమా గురించి నలుగురు ఈ రేంజ్ లో మాట్లాడుకోవడమే.. ఓపెనింగ్స్ ను డిసైడ్ చేస్తుంది. ఇది ప్రతి దర్శక నిర్మాత ఫాలో అవ్వాల్సిన మెయిన్ స్ట్రాటజీ. ఇందులో రాజమౌళిని మించిన వారు లేరు. ఇప్పుడు సుక్కు కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం విపరీతమైన బజ్ సంపాదించుకుంటున్న పుష్ప 2 ది రూల్ మూవీ ప్రమోషన్స్ తో దుమ్ము దులిపేస్తుంది.

ఇప్పటివరకు పుష్ప 2 మూవీ రెండు ఈవెంట్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా.. అసలు ఎవరి ఊహలకు అందని విధంగా బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేసింది. దీనితో నేషనల్ మీడియా ఫోకస్ అంతా అప్పటినుంచి పుష్ప మీదే ఉంది. ఇసుకేస్తే రాలనంత జన సందోహం.. వారిని చూసి పోలీసులే షాక్ అయ్యారు. నెక్స్ట్ డే మీడియా , సోషల్ మీడియా అంతా పుష్ప 2 కవరేజ్ తో నిండిపోయాయి. ఇక రీసెంట్ గా చెన్నైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ గెస్ట్ గా రావడం, దేవి శ్రీ స్పీచ్ , బన్నీ డ్యాన్స్ , హీరోయిన్స్ గ్లామర్ , జనంతో నిండిపోయిన స్టేడియం.. ఈవెంట్ కు హైలెట్ అయ్యాయి. ఇలా పుష్ప 2 ప్రమోషన్స్ తో డబుల్ సిక్సర్ కొట్టేసింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి జనం మాట్లాడుకునేలా చేస్తుంది.

గతంలో కూడా చాలా సినిమాలకు హీరోలు బయట రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేశారు. కానీ అది కేవలం కొన్ని ప్రెస్ మీట్స్ వరకే పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు పుష్ప2 తో మరో అడుగు ముందుకు వేసాడు బన్నీ. పబ్లిక్ ప్లేసుల్లో ఈవెంట్స్ కండక్ట్ చేసి.. అభిమానులు పల్స్ క్యాచ్ చేస్తు కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు పుష్ప టీమ్. వీటి అన్నిటికి కోట్లలో ఖర్చు అయ్యే ఉంటుంది. అదంతా పక్కన పెడితే… ఇప్పటివరకు అయితే హైప్ ను పెంచడానికి చేసిన ప్రతి ప్లాన్ సక్సెస్ అయింది. కచ్చితంగా ఇది ఓపెనింగ్స్ మీద పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ను క్రియేట్ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ అంతకంత వసూళ్ల రూపంలో లాభాలు తెచ్చేస్తుంది. ఇక సౌత్ లో మాత్రమే పుష్ప ఈవెంట్స్ బాకీ ఉన్నాయి. ఇక్కడ పుష్ప 2 ఎలాంటి హైప్ ఫార్మ్ చేస్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom