iDreamPost
android-app
ios-app

హిస్టరీలో ఫస్ట్ టైం అక్కడ లేడీస్ కు పుష్ప 2 స్పెషల్ షో

  • Published Nov 06, 2024 | 5:37 PM Updated Updated Nov 06, 2024 | 5:37 PM

Pushpa2 Special Shows: ఇప్పుడు పుష్ప 2 మూవీ గురించి బజ్ అంతా బాగానే ఉంది. బయట ఫ్యాన్స్ హడావిడి అంతకుమించి ఉంది. కానీ పుష్ప మేకింగ్ టీం మాత్రం కంగారులో ఉంది. ఇవన్నీ ఒకెత్తయితే బయట ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు. ఏకంగా ఓ చోట లేడి ఫ్యాన్స్ కు స్పెషల్ షో ను ఏర్పాటు చేశారట. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

Pushpa2 Special Shows: ఇప్పుడు పుష్ప 2 మూవీ గురించి బజ్ అంతా బాగానే ఉంది. బయట ఫ్యాన్స్ హడావిడి అంతకుమించి ఉంది. కానీ పుష్ప మేకింగ్ టీం మాత్రం కంగారులో ఉంది. ఇవన్నీ ఒకెత్తయితే బయట ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు. ఏకంగా ఓ చోట లేడి ఫ్యాన్స్ కు స్పెషల్ షో ను ఏర్పాటు చేశారట. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Nov 06, 2024 | 5:37 PMUpdated Nov 06, 2024 | 5:37 PM
హిస్టరీలో ఫస్ట్ టైం అక్కడ లేడీస్ కు పుష్ప 2 స్పెషల్ షో

సరిగ్గా నెల రోజుల తర్వాత పుష్ప ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే టాక్స్ మొదలవుతాయి. ఈసారి బన్నీ ఆర్మీ అంతా కాలర్ ఎగరేస్తూ ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ విజువల్స్ అన్ని కూడా బన్నీ ఫ్యాన్స్ కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పుష్ప 2 మీద నడుస్తున్న బజ్ అలాంటిది . నిజానికి మూవీ టీం నుంచి ఇంకా సరైన మూమెంట్ రాలేదు. షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. సినిమాకు నెల రోజులు సమయమే ఉన్నా.. ఇంకా షూటింగ్ ఏంటి అని విమర్శించేవారు ఒకరైతే. సుకుమార్ మీద ఉన్న నమ్మకంతో మూవీ రిలీజ్ అరేంజ్మెంట్స్ చేసేవారు కొందరు. ఇప్పటికే ఓవర్శిస్ లో పుష్ప 2 కు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. ఇండియాలో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయా అని అభిమానులతో పాటు.. మూవీ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయంటే ఇక ఆ రికార్డ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.

ఇదంతా సరే బన్నీ సినిమా రిలీజ్ అంటే హడావిడి ఈ రేంజ్ లో ఉండడం సహజం. మొదటి రోజు మొదటి షో నుంచి అభిమానులు థియేటర్స్ కు పోటెత్తుతారు. అయితే ఇప్పుడు ఈ సినిమా త్వరలో ఓ రేర్ రికార్డ్ ను క్రియేట్ చేయబోతుంది. హిస్టరీలో ఫస్ట్ టైం.. కేవలం లేడి ఫ్యాన్స్ కు మాత్రమే స్పెషల్ షో వేయబోతున్నారు. అది కూడా తెలుగు హీరోకి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. కేరళలో ఇది జరగబోతుంది. అక్కడ పుష్ప 2 సినిమాకు కేవలం లేడీస్ కు మాత్రమే స్పెషల్ షో వేయబోతున్నట్లు.. అల్లు ఆర్మీ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఉదయం 7 గంటలకు ఈ షో ఉండబోతున్నట్లు ప్రకటించారు. దీనితో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో తెలుగు స్టేట్స్ లో కూడా ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ లేకపోలేదు.

ఓ వైపు చిత్ర బృందం మూవీ షూటింగ్ పనుల్లో సతమవుతుంటే.. మరో వైపు ఫ్యాన్స్ ఇలా సినిమా కోసం పరితపిస్తున్నారు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా దానిని అసలు మిస్ చేసుకోవడం లేదు అభిమానులు. ఇప్పుడే ఇలా ఉంటె ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ , ప్రమోషన్స్ స్టార్ట్ అయితే అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అవుతాయో.. అందరి భారీ అంచనాలను ఈ భారీ బడ్జెట్ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. ఇప్పటివరకు హైప్ , ప్రీ రిలీజ్ బిజినెస్ విషయాల్లో అయితే ఎక్కడా లోటు చేయడం లేదు. ఇక కలెక్షన్స్ కొత్త రికార్డ్స్ గురించి తెలియడమే బ్యాలెన్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet giriş