పుష్ప-2 నుండి కపుల్ సాంగ్! సామీ సామీ సాంగ్ ని మరిపించే రేంజ్ లో!

Pushpa 2 Second Single Out Now: పుష్పరాజ్- శ్రీవల్లి కోసం తెలుగు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారి కోరికను తీరుస్తూ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లోకి తీసుకురావడమే కాదు.. ఇద్దరితో అదిరిపోయే స్టెప్స్ కూడా వేయించారు.

Pushpa 2 Second Single Out Now: పుష్పరాజ్- శ్రీవల్లి కోసం తెలుగు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారి కోరికను తీరుస్తూ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లోకి తీసుకురావడమే కాదు.. ఇద్దరితో అదిరిపోయే స్టెప్స్ కూడా వేయించారు.

ప్రస్తుతం పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ లెవల్లో పుష్పరాజ్ ఆగమనం గురించి సినిమా లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురుచూపులకు తగ్గట్లు పుష్ప 2 ది రూల్ సినిమా బృందం వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ని పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ కూడా వచ్చేసింది. అయితే ఇప్పటివరకు పుష్పరాజ్ హడావుడే చూశారు. కానీ, ఇప్పుడు శ్రీవల్లి కూడా ఫ్యాన్స్ ని పలకరించడానికి వచ్చేసింది. ఇప్పటికే శ్రీవల్లి పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు సెకండ్ సింగిల్ తో శ్రీవల్లి డాన్సులను, అల్లరిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. చూసేందుకు అగ్గిరవ్వలాగా ఉంటాడు నా సామీ అంటూ శ్రీవల్లి ఇరగదీసింది.

పుష్ప పార్ట్ 1లో నా సామీ.. రారా సామీ.. సాంగ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆ పాటను హమ్ చేసేవాళ్లు ఉండనే ఉన్నారు. ఇప్పుడు దానికి మించిన క్రేజ్ ఈ పాట సొంతం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ‘సూసేకి అగ్గిరవ్వలాగా ఉంటాడు నా సామీ’ సాంగ్ అనౌన్స్ అప్పుడే నెక్ట్స్ లెవల్ ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. వారి అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా వాటిని మరింత రెట్టింపు చేస్తూ ఈ పాట హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా పుష్పరాజ్- శ్రీవల్లి మధ్య ఉండే బాండింగ్, ఆ కెమిస్ట్రీని ఈ పాటలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

పుష్పరాజ్ కు శ్రీవల్లి మీద ఉండే ప్రేమ ప్రతి ఫ్రేమ్ లో మీకు కనిపిస్తుంది. సాధారణంగా లిరికల్ వీడియో అంటే పాటలోని హుక్ స్టెప్ చూపించి.. ఫొటోలు వేస్తూ లిరిక్స్ ఇస్తారు. కానీ, పుష్ప టీమ్ మాత్రం ఈసారి కాస్త కొత్తగా ట్రై చేసింది. అంటే సాంగ్ లో ఉండే కాస్ట్యూమ్స్, హీరోహీరోయిన్ లుక్స్ ఏమాత్రం రివీల్ చేయకుండా.. కేవలం వారి ప్రాక్టీస్ వీడియో మాత్రమే చూపించింది. అందులోనే హుక్ స్టెప్స్, వారి ప్రాక్టీస్ సెషన్ మొత్తాన్ని రష్మికా పాట పాడుతున్నట్లు చూపించారు. ఇది మాత్రం కాస్త కొత్తగానే అనిపిస్తోంది. ఇంకొకటి ఏంటంటే.. సాంగ్ లో ఉండే లిరిక్స్ ఎంతో ఫ్రెష్ గా అందరూ హమ్ చేసే విధంగా ఉన్నాయి. ఇంక డాన్స్ అయితే నెక్ట్స్ లెవల్లో ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ పార్ట్ లో పుష్పరాజ్ కు ఈ రెండో పార్ట్ లో ఉండే పుష్పరాజ్ కు ఏమాత్రం పోలికలు కనిపించడం లేదు. తన సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఏలడం ప్రారంభించేశాడు. ఈ సాంగ్ లో కూడా అదే విషయం కనిపించింది. మరి.. పుష్పరాజ్- శ్రీవల్లి సాంగ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments