iDreamPost
android-app
ios-app

విడుదలకు ముందే ఓవర్శిస్ లో పంజా విసురుతున్న పుష్ప రాజ్

  • Published Nov 06, 2024 | 12:31 PM Updated Updated Nov 06, 2024 | 12:31 PM

pushpa 2 pre sales : పుష్ప 2 మీద ఉన్న హైప్ అంత ఇంత కాదు. త్వరలోనే ఈ హైప్ నిజం అని రుజువు కాబోతుంది కూడా. ఆ అంచనాలను వర్ణించడం కూడా ఎవరితరం కావడం లేదు . ఈ క్రమంలో ఇప్పుడు పుష్ప రాజ్ ఓవర్శిస్ లో పంజా విసురుతున్నాడు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

pushpa 2 pre sales : పుష్ప 2 మీద ఉన్న హైప్ అంత ఇంత కాదు. త్వరలోనే ఈ హైప్ నిజం అని రుజువు కాబోతుంది కూడా. ఆ అంచనాలను వర్ణించడం కూడా ఎవరితరం కావడం లేదు . ఈ క్రమంలో ఇప్పుడు పుష్ప రాజ్ ఓవర్శిస్ లో పంజా విసురుతున్నాడు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Nov 06, 2024 | 12:31 PMUpdated Nov 06, 2024 | 12:31 PM
విడుదలకు ముందే ఓవర్శిస్ లో పంజా విసురుతున్న పుష్ప రాజ్

ది హైప్ ఈజ్ రియల్ అనే ఈ స్టేట్మెంట్ ఇప్పటివరకు చాలానే సినిమాల విషయంలో ప్రూవ్ అయింది. ఇక ఇప్పుడు త్వరలో పుష్ప 2 విషయంలో కూడా ఈ మాట నిజం కాబోతుంది. విడుదలకు నెల రోజుల ముందే ఓవర్శిస్ లో అప్పుడే ఊచకోత మొదలుపెట్టింది. త్వరలోనే పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టనున్నారు. అసలు మేకర్స్ నుంచి ఎలాంటి  మూమెంట్స్ రాకుండానే సినిమాకు ఇంత హైప్ ఉంటే.. తర్వాత పరిస్థితి ఏంటో అందరూ గెస్ చేయొచ్చు. ప్రస్తుతం పుష్ప 2 మీద పెరుగుతున్న అంచనాలను వర్ణించడం ఎవరి తరం కావడం లేదు. విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే.. 700 కు పైగా లొకేషన్స్ లో.. ఇప్పటికే 15 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం.

రానున్న రోజుల్లో తగ్గేదేలే అంటూ ఈ లెక్క పెరుగుతూ పోతుంది.. ఆ సంగతి అందరికి తెలిసిందే. అటు ఓవర్శిస్ లో కూడా అప్పుడే పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతుంది. కేవలం వీటి ద్వారా ఇప్పటివరకు  4 లక్షల 10 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసింది పుష్ప 2. గతంలో పార్ట్ 1 చేసిన వసూళ్లను ఈ సినిమా ఇంత వేగంగా దాటేయడం విశేషం. ఇలా రోజు రోజుకి పెరుగుతూ పోతున్న అంచనాలే.. సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేస్తున్నాయి. ఇదంతా కూడా ఇప్పటివరకు ఓపెన్ చేసిన 2750 షోస్ నుంచి నమోదైన డేటా. ఇంకా దీనికి బోలెడు షోస్ యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే రోజులు గడిచే కొద్దీ షాకింగ్ నెంబర్లే వినిపిస్తుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ లెక్కన పుష్ప 2 రికార్డ్స్ RRR, కల్కి రికార్డ్స్ దగ్గరలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒక్క నార్త్ అమెరికాలోనే ఇలా ఉంటె.. కెనడా లాంటి ఇతర దేశాల్లో కూడా టికెట్స్ అమ్మడం స్టార్ట్ చేస్తే.. ఇక అది అరాచకమే.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగానే ఏ సినిమా రిలీజ్ చేసినా థియేటర్స్ మొదటి షో నుంచే హౌస్ ఫుల్ అవుతూ ఉంటాయి. అలాంటిది ఇంత హైప్ ఉన్న భారీ బడ్జెట్ మూవీ.. అందులోను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత డిఫరెంట్ లుక్ లో స్క్రీన్ మీద కనిపించబోతున్నాడు. మరి కచ్చితంగా ఇక్కడ నెక్స్ట్ లెవెల్ లో రికార్డ్స్ నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. తెల్లవారుజామునుంచే షోస్ ఉంటాయి కాబట్టి.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులంతా థియేటర్స్ కు పోటెత్తడం ఖాయం. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయితే .. ఇక సౌత్ తో నార్త్ రూలింగ్ అంతా పుష్ప రాజ్ దే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే అప్డేట్స్ ఎలాంటి హీట్ పెంచుతాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş