iDreamPost
android-app
ios-app

పుష్ప 2 మూవీ రన్ టైం పై క్రేజి అప్డేట్..

  • Published Nov 12, 2024 | 3:00 PM Updated Updated Nov 12, 2024 | 3:00 PM

Pushpa 2 Runtime: ఈ నెల 17న ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నారట. ప్రమోషన్స్ విషయంలో కూడా పక్కా ప్లాన్ ని అయితే రెడీ చేశారు. కానీ వాటిని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారన్నదే డౌట్. అయితే ఇప్పుడు సినిమా గురించి ఓ క్రేజి న్యూస్ వినిపిస్తుంది. పుష్ప 2 రన్ టైం విషయంలో యూనిట్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

Pushpa 2 Runtime: ఈ నెల 17న ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నారట. ప్రమోషన్స్ విషయంలో కూడా పక్కా ప్లాన్ ని అయితే రెడీ చేశారు. కానీ వాటిని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారన్నదే డౌట్. అయితే ఇప్పుడు సినిమా గురించి ఓ క్రేజి న్యూస్ వినిపిస్తుంది. పుష్ప 2 రన్ టైం విషయంలో యూనిట్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

  • Published Nov 12, 2024 | 3:00 PMUpdated Nov 12, 2024 | 3:00 PM
పుష్ప 2 మూవీ రన్ టైం పై క్రేజి అప్డేట్..

పుష్ప 2 మీద రోజుకు ఒక కొత్త అప్డేట్. రోజుకు ఒక కొత్త ట్రెండ్ మొదలవుతుంది. శ్రీలీల , అల్లు అర్జున్ డ్యాన్స్ ఎలా ఉండబోతుందా అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. బయట ఇంత రచ్చ జరుగుతుంటే మూవీ టీం మాత్రం ఇంకా షూట్ దగ్గరే ఉంది. రిలీజ్ కు ఇంకా నెల రోజులు కూడా లేదు. అయినా సరే షూట్ ఫినిష్ కాలేదు. ఆపై ఇంకా ఫినిషింగ్ వర్క్స్ గురించి తెలియంది కాదు. ఇవన్నీ సుకుమార్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఏమో తెలియదు. కానీ సినిమాపై అందరికి కోటి ఆశలు ఉన్నాయన్నది మాత్రం నిజం. బహుశా రిలీజ్ కు దగ్గర్లో ఉండి కూడా ఇంకా షూట్ ఫినిష్ కాకుండానే.. ఇంత హైప్ ఉన్న సినిమా ఇదేనేమో. ఇక అంతా సుకుమార్ చేతుల్లోనే ఉంది. టీం కూడా అంత బిజీ గా ఉన్నా సరే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఎగ్జైట్మెంట్‌ను పెంచుతోంది.

ట్రైలర్ లాంచ్ డేట్ ను కూడా తాజాగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 17న ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నారట. ప్రమోషన్స్ విషయంలో కూడా పక్కా ప్లాన్ ని అయితే రెడీ చేశారు. కానీ వాటిని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారన్నదే డౌట్. అయితే ఇప్పుడు సినిమా గురించి ఓ క్రేజి న్యూస్ వినిపిస్తుంది. పుష్ప 2 రన్ టైం విషయంలో యూనిట్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే ప్రస్తుతం షూట్ చేసి ఎడిటింగ్ పూర్తి చేసిన కాపీ రన్ టైం.. మూడు గంటల 15 నిమిషాల వరకు వచ్చిందట. ఇంకా దానికి రెండు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ కూడా యాడ్ చేయాల్సి ఉందట. ఇలా మొత్తంగా చూస్తే మూవీ రన్ టైం మూడున్నర గంటల వరకు రావచ్చని సమాచారం. మరి ఇంత లాంగ్ రన్ టైం తో రిలీజ్ చేస్తే..ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది సందేహం. ఆల్రెడీ గతంలో యానిమల్ మూవీ అంతే రన్ టైం తో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలా అని ప్రతి సినిమాను అంతే నిడివితో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక సుకుమార్ సినిమాలంటే మూడు గంటల రన్ టైం కామన్ అయింది. రంగస్థలం , పుష్ప సినిమాలు అంతే నిడివితో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకున్నాయి. కాబట్టి ఇప్పుడు సుకుమార్ పుష్ప 2 విషయంలో కూడా అటు ఇటుగా మూడు గంటల రన్ టైంతో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఒక్కసారి షూట్ అంతా కంప్లీట్ అయితే.. అప్పుడు సుకుమార్ క‌త్తెర‌కు ప‌ని చెప్తాడనే టాక్ నడుస్తుంది. ఆ దశలో కనీసం 20 నిమిషాల వరకైనా ఎడిట్ చేసే అవకాశం ఉంది. ఎలా చూసినా సినిమా రన్ టైం మూడు గంటలకు తగ్గే ఛాన్స్ లేదు అనేది టీం నుంచి అందుతున్న సమాచారం. మరి సుకుమార్ ఏం చేస్తాడో చూడాలి. మొత్తానికి ఇది భారీ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom