iDreamPost
android-app
ios-app

పుష్ప 2 లో ఆ సీన్ కోసం ఏకంగా రూ.50 కోట్లు.. థియేటర్ లో పూనకాలే

  • Published Oct 24, 2024 | 5:50 PM Updated Updated Oct 24, 2024 | 5:50 PM

Pushpa 2 Movie Update: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ కూడా జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు బయట పడ్డాయి . దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Pushpa 2 Movie Update: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ కూడా జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు బయట పడ్డాయి . దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 24, 2024 | 5:50 PMUpdated Oct 24, 2024 | 5:50 PM
పుష్ప 2 లో ఆ సీన్ కోసం ఏకంగా  రూ.50 కోట్లు.. థియేటర్ లో పూనకాలే

ఇక్కడ ఉండేది ఒకటే రూల్ అది పుష్ప గాడి రూల్.. ఆగలేకపోతున్నాం సర్.. అంటూ సోషల్ మీడియా అంత పుష్ప మ్యానియాలో మునిగితేలుతోంది. పుష్ప మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ అభిమానులను మరింత ఊరిస్తుంది. ఇప్పటివరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్నట్లుగా.. పుష్ప 2 క్రేజ్ ఇప్పుడు మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను మేకర్స్ బయటపెట్టారు. అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ముందు నుంచి సినిమాలో జాతర సాంగ్ గురించి ఎలాంటి హైప్ నడుస్తుందో తెలియనిది కాదు. సినిమా మొత్తానికే ఈ సాంగ్ మెయిన్ పిల్లర్ కాబోతుందనే టాక్ ఆల్రెడీ ఉంది. ఈ సాంగ్ కోసం భారీగా ఖర్చుపెట్టారనే బజ్ కూడా ఉంది. కానీ తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో సాంగ్ కోసం ఖర్చుపెట్టిన భారీ బడ్జెట్ సంఖ్య బయటపడింది. ఒక్క జాతర ఎపిసోడ్ కోసం అక్షరాల రూ.50 కోట్లు ఖర్చు చేశారట.

ఇదే విషయాన్నీ మైత్రి మూవీ నిర్మాత రవి శంకర్ చెప్పారు. పుష్ప 2 లో జాతర ఎపిసోడ్ హైలెట్ కానుందని.. మాస్టర్ పీస్ లా డిజైన్ చేశామని.. జాతర ఎపిసోడ్ థియేటర్ లో గూస్బంప్స్ తెప్పిస్తుందని.. 10,15 రోజుల రిహార్సల్ జరిపిన తర్వాత 35 రోజులు ఈ సాంగ్ షూట్ చేశామని చెప్పుకొచ్చారు. సో ఈ ఒక్క మాటతో పుష్ప 2 మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఐటెం సాంగ్ కోసం ఆల్రెడీ బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ ఫిక్స్ అయిందని కూడా అనౌన్స్ చేశారు. నవంబర్ 4 నుంచి ఈ సాంగ్ షూట్ ఉండబోతుందంట. పైగా ఈ సినిమాకు సంబంధించి మరొక రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను కూడా రివీల్ చేశారు. ముందు నుంచి అనుకున్నట్లుగానే పుష్ప 2 రిలీజ్ డేట్ ను ప్రీ పోన్ చేశారు. డిసెంబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే పుష్ప 2 తర్వాత.. పుష్ప 3 మూవీ కూడా ఉండబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్.

ఇక పుష్ప 2 కథ విషయానికొస్తే.. పార్ట్ 1 లోలానే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు.. డ్రామా కు కూడా ఎక్కువ స్కోప్ ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇలా మొత్తానికి సినిమా మీద ఇప్పటివరకు ఉన్న అంచనాలను డబుల్ చేశారని చెప్పాలి. ఇక త్వరలో షూట్ పూర్తైన తర్వాత మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రివీల్ చేయనున్నారు మేకర్స్. మరి ఆ అప్డేట్స్ పుష్ప 2 పైన ఉన్న అంచనాలను ఎక్కడకు తీసుకుని వెళ్తాయో చూడాలి. రిలీజ్ టైం దగ్గరపడడంతో ప్రస్తుతానికి షూటింగ్ పనుల శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పుష్ప టీం. మరి ఈ సినిమా విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş