iDreamPost
android-app
ios-app

దేవర తరహాలో పుష్ప-2.. పక్కా ప్లానింగ్ తో వస్తున్న మేకర్స్!

  • Published Oct 15, 2024 | 1:29 PM Updated Updated Oct 15, 2024 | 1:29 PM

Pushpa-2: దేవర తో తారక్ దుమ్ము దులిపేశాడు. ఆ లెక్కలు ఈ లెక్కలు అంటూ అన్నిటిని సెటిల్ చేసేశాడు. ఇప్పటివరకు తారక్ తీసిన సినిమాలలో దేవర బెస్ట్ మూవీ గా నిలిచిపోతుంది. ఇక ఇప్పుడు ఆ లెక్కలు సెట్ చేయడం బన్నీ వంతు. అదేంటో చూసేద్దాం.

Pushpa-2: దేవర తో తారక్ దుమ్ము దులిపేశాడు. ఆ లెక్కలు ఈ లెక్కలు అంటూ అన్నిటిని సెటిల్ చేసేశాడు. ఇప్పటివరకు తారక్ తీసిన సినిమాలలో దేవర బెస్ట్ మూవీ గా నిలిచిపోతుంది. ఇక ఇప్పుడు ఆ లెక్కలు సెట్ చేయడం బన్నీ వంతు. అదేంటో చూసేద్దాం.

  • Published Oct 15, 2024 | 1:29 PMUpdated Oct 15, 2024 | 1:29 PM
దేవర తరహాలో పుష్ప-2..  పక్కా ప్లానింగ్ తో వస్తున్న మేకర్స్!

మొత్తానికి తారక్ చెప్పింది చెప్పినట్లు చేశాడు. దేవరతో దుమ్ము దులిపేశాడు. ఈ ఏరియా ఆ ఏరియా అని తేడా లేకుండా అన్ని ఏరియాస్ లో రికార్డ్ క్రియేట్ చేశాడు. డివైడ్ టాక్ తో మొదలయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది దేవర. అది కాకుండా కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. అలాగే ముందుగా అనుకున్న 500 కోట్ల మార్క్ ను కూడా దాటేసింది. ఇక ఇప్పుడు దసరా కూడా ముగిసిపోయింది. పైగా అప్పుడే దేవర డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కూడా వినిపిస్తుంది. సో ఇంకా దాదాపు థియేటర్స్ లో దేవర మ్యానియా ముగిసినట్లే. దేవర స్పెషల్ రికార్డ్స్ ను క్రియేట్ చేయడమే కాకుండా.. తర్వాత వచ్చే సినిమాలకు టార్గెట్ ను సెట్ చేసింది. దీనితో ఇప్పుడు ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడం నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ వంతు. ఇప్పుడు ఈ లైన్ లో పుష్ప రాజ్ ఉన్నాడు.

సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప-2 సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు దేవర బాటలోనే పుష్ప-2 కూడా వెళ్తుంది. వాస్తవానికి ముందుగా అనుకున్న సమయానికి పుష్ప-2 కనుక రిలీజ్ అయ్యుంటే.. ఆ టార్గెట్ ను దేవర రీచ్ అవుతుందా లేదా అనే డిస్కషన్స్ జరిగేది. కానీ ఇప్పుడు లెక్కలు తారుమారయ్యాయి. దేవరోడి ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఇప్పుడు పుష్ప రాజ్ ముందున్న బిగ్ టార్గెట్. దేవర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 172కోట్లు కలెక్ట్ చేసింది. దీనితో ఇప్పటినుంచే పుష్ప-2 పక్కా ప్లానింగ్ ను రెడీ చేస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాకు బాగానే బజ్ నడుస్తుంది. కాబట్టి టాక్ ఎలా ఉన్నా కానీ నాలుగైదు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ను అందుకోవాలని చూస్తుంది. ఇక ఆ తర్వాత పుష్ప రాజ్ ముందున్న మరో బిగ్ టాస్క్ ..జక్కన్న ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అయిన 223 కోట్ల గ్రాస్ ను రీచ్ అవ్వడం. ఈ రెండు టార్గెట్స్ ను రీచ్ అవ్వాలంటే స్క్రీన్స్ పెరగాలి. దానికి తగిన ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అందుకే ఇప్పుడు అల్లు కాంపౌండ్ బాలీవుడ్ కాంటాక్ట్ లను పెంచుకుంటుంది. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ప్రస్తుతానికి సినిమా ఫస్ట్ హాఫ్ కు సంబంధించి మంచి హైప్ నడుస్తుంది. అలాగే మొదటి పార్ట్ లో సమంత చేసిన ఐటెం సాంగ్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇప్పడు పుష్ప2 అనుకున్నట్లుగా హిట్ అవ్వాలంటే దానికి మించిన ఐటెం సాంగ్ ఇందులో ఉండాలి. ఈ నెలాఖరుకు ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. పైగా సినిమాను అనుకున్న దానికంటే ఓ రోజు ముందుగానే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ కు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. మూవీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే త్వరలోనే మూవీకి సంబంధించిన అప్డేట్స్ ను కూడా ఇవ్వనున్నారు. ఇక ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi giriş