iDreamPost
android-app
ios-app

పుష్ప 2 లో ఆ స్పెషల్ సాంగ్ మిస్ అయ్యే ఛాన్స్ !

  • Published Nov 05, 2024 | 2:56 PM Updated Updated Nov 05, 2024 | 2:56 PM

Pushpa 2 Updates : పుష్ప 2 సినిమా కోసం అందరు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా సరిగ్గా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయలేదులే కానీ.. అయినా సరే సినిమా గురించి వస్తున్న బజ్ మాత్రం బాగానే ఉంది. అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.

Pushpa 2 Updates : పుష్ప 2 సినిమా కోసం అందరు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా సరిగ్గా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయలేదులే కానీ.. అయినా సరే సినిమా గురించి వస్తున్న బజ్ మాత్రం బాగానే ఉంది. అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.

  • Published Nov 05, 2024 | 2:56 PMUpdated Nov 05, 2024 | 2:56 PM
పుష్ప 2 లో ఆ స్పెషల్  సాంగ్ మిస్ అయ్యే ఛాన్స్ !

ఇంకా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. సరిగ్గా సాలిడ్ అప్డేట్ కూడా లేదు. అటు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే అటు షూటింగ్ కూడా  కంప్లీట్ అవ్వలేదు. అయినా సరే పుష్ప 2 కి మాత్రం విపరీతమైన బజ్ ఉంది. అయితే  ఇంకా పుష్ప 2 కు సంబంధించి రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నట్లు సమాచారం. రీసెంట్ గా సినిమాలోని ఐటెం సాంగ్ కోసం ఎట్టకేలకు హీరోయిన్ దొరికింది. శ్రీలీలతో పుష్ప రాజ్ స్టెప్పులంటూ.. ఆ న్యూస్ బాగా వైరల్ అయింది. అసలే ఈ అమ్మడు డ్యాన్స్ ను దంచేస్తోంది. అటు ఐకాన్ స్టార్ యూనిక్ స్టెప్పులు గురించి తెలియనిది కాదు. దీనితో వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ చేయగానే.. పోతారు మొత్తం పోతారు అంటూ ఒకటే హైప్. దాదాపు ఈ సాంగ్ షూటింగ్ ను ఈ వారం కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక ఆ తర్వాత ప్రమోషన్స్ ప్లాన్ చేస్తారు. ప్రస్తుతానికి సినిమా మీద బజ్ బాగానే ఉంది. కానీ సినిమా రిలీజ్ కు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచితే బావుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఈ సినిమాలో ఐటెం సాంగ్ కాకుండా మరో స్పెషల్ సాంగ్ ఉందట. కానీ ఇప్పుడు ఆ సాంగ్ షూట్ చేసే సమయం మాత్రం మేకర్స్ దగ్గర లేదట. సినిమా రిలీజ్ కు ఎంతో సమయం లేదు. ఐటెం సాంగ్ షూట్ కంప్లీట్ అయితే.. పోస్ట్ ప్రొడక్షన్ , ప్రమోషన్స్ పనులు ఎలాగూ ఉంటాయి. పైగా ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్ ను కూడా యాడ్ చేస్తే సినిమా లెంగ్త్ ఇంకాస్త పెరుగుతుంది. అది తప్ప సాంగ్ ద్వారా కలిసొచ్చే దేమి లేదు. కాబట్టి ఈ సాంగ్ పైన ఫోకస్ పెట్టడం కంటే.. మిగిలిన వర్క్స్ మీద ద్రుష్టి పెట్టడం బెటర్ అని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం. కానీ దీనిపైనా ఇంకా పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు. ఐటెం సాంగ్ కంప్లీట్ అయ్యే టైం ను బట్టి.. ఈ స్పెషల్ సాంగ్ షూట్ గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాస్త అటు ఇటు అయితే మాత్రం ఆడియోలో వినిపించే పాట.. సినిమాలో కనిపించకపోవచ్చు. మూవీ నుంచి అన్ని అప్డేట్స్ రిలీజ్ చేస్తే కానీ ఆ సాంగ్ ఏంటి అనే క్లారిటీ రాదు.

దేవర సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. దావుది సాంగ్ ను షూట్ చేశారు కానీ సినిమా రిలీజ్ అప్పుడు మాత్రం దానిని కట్ చేశారు. ఆ తర్వాత కొన్ని డేస్ కు దానిని తిరిగి జోడించారు. ఇప్పుడు పుష్ప విషయంలోనూ అదే జరుగుతుంది. కథాగమనంలో ఉపయోగపడని పాట.. ఎంత బాగున్నా సరే దానిని అనవసరంగానే భావిస్తారు దర్శక నిర్మాతలు. ఇది ఏ సినిమాలో అయినా సహజమే. ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సినిమా రిలీజ్ కు ఎంతో సమయం లేదు కాబట్టి.. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నారు మేకర్స్. ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş