iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో గ్రాండ్ గా పుష్ప 2 ఈవెంట్స్.. ఎక్కడంటే?

  • Published Nov 29, 2024 | 4:26 PM Updated Updated Nov 29, 2024 | 4:26 PM

పుష్ప మ్యానియా ప్రపంచమంతా పాకేస్తుంది. ఎక్కడ చూసినా పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మొన్నటివరకు లాస్ట్ మినిట్ వర్క్స్ లో బిజీ గా ఉన్న సుకుమార్ కూడా ఇప్పుడు వర్క్ ఫినిష్ చేసుకుని ఫ్రీ అయ్యాడు. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ప్రమోషన్స్ మీదే పెట్టారు టీం సభ్యులు. ప్రెస్ మీట్స్ , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి భారీ రెస్పాన్స్ లభిస్తుంది.

పుష్ప మ్యానియా ప్రపంచమంతా పాకేస్తుంది. ఎక్కడ చూసినా పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మొన్నటివరకు లాస్ట్ మినిట్ వర్క్స్ లో బిజీ గా ఉన్న సుకుమార్ కూడా ఇప్పుడు వర్క్ ఫినిష్ చేసుకుని ఫ్రీ అయ్యాడు. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ప్రమోషన్స్ మీదే పెట్టారు టీం సభ్యులు. ప్రెస్ మీట్స్ , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి భారీ రెస్పాన్స్ లభిస్తుంది.

  • Published Nov 29, 2024 | 4:26 PMUpdated Nov 29, 2024 | 4:26 PM
హైదరాబాద్ లో గ్రాండ్ గా పుష్ప 2 ఈవెంట్స్.. ఎక్కడంటే?

పుష్ప మ్యానియా ప్రపంచమంతా పాకేస్తుంది. ఎక్కడ చూసినా పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మొన్నటివరకు లాస్ట్ మినిట్ వర్క్స్ లో బిజీ గా ఉన్న సుకుమార్ కూడా ఇప్పుడు వర్క్ ఫినిష్ చేసుకుని ఫ్రీ అయ్యాడు. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ప్రమోషన్స్ మీదే పెట్టారు టీం సభ్యులు. ప్రెస్ మీట్స్ , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి భారీ రెస్పాన్స్ లభిస్తుంది. ఆల్రెడీ పాట్నా , చెన్నై , కొచ్చిలో ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్నారు పుష్ప టీం. ఇతర రాష్ట్రాలను పబ్లిసిటీ తో ఒక ఊపు ఊపేస్తున్న పుష్ప రాజ్ ఎప్పుడెప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెడతాడా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా తెలుగు రాష్ట్రలో ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 30 న చిత్తూర్ లో ప్లాన్ చేసినట్లు టాక్ వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం అక్కడ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను.. హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ ను డిసెంబర్ 1న కండ్లకోయ లోని మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయనున్నారంట మేకర్స్. శ్రేయాస్ మీడియా దీనిని ఆర్గనైజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సుమారు 5 లక్షల మంది ఈ ఈవెంట్ కు అటెండ్ అవుతారని అంచనా. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే దాదాపు ఇప్పటివరకు ఈవెంట్స్ అన్నిటిలో కూడా బన్నీ ఒక్కడే మాట్లాడడం జరిగింది. కానీ మొదటిసారి హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ కు సుకుమార్ కూడా అటెండ్ అవుతున్నాడట. మొన్నటివరకు అంటే సుకుమార్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు సెన్సార్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి.. ఈ ఈవెంట్ కు కచ్చితంగా అటెండ్ అవుతాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది.

సుకుమార్ మాట్లాడితే ఎప్పుడెప్పుడు విందామా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఒక సినిమా గురించి దర్శకుడిగా తెలిసినంత ఇంకెవరికి తెలీదు. మిగిలిన వారు సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయినా కూడా.. మొదటి నుంచి చివరి వరకు అందులో లోటు పాట్లు తెలిసేది ఒక్క దర్శకుడికి మాత్రమే. సో సినిమా గురించి సుకుమార్ ఏం చెప్తాడా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందులోను సుక్కు మాటలు ప్రేక్షకులలో చాలా ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈసారి హైదరాబాద్ లో జరగబోయే భారీ ఈవెంట్.. ఇప్పటివరకు జరిగిన ఈవెంట్స్ కు మించి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఈవెంట్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpipo girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş