iDreamPost
android-app
ios-app

సందీప్ రెడ్డి వంగ సినిమాకు పూరి డైలాగులు..?

  • Published Nov 06, 2024 | 1:08 PM Updated Updated Nov 06, 2024 | 1:08 PM

Spirit Movie Updates: సందీప్ రెడ్డి వంగ రెబెల్ స్టార్ ప్రభాస్.. రాబోయే ఓ సెన్సేషన్. ఈ సినిమా గురించి రోజు రోజుకి వినిపిస్తున్న వార్తలు అంచనాలను మరింత బలంగా పెంచేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాలో పూరి కూడా భాగం కాబోతున్నాడనే వార్తా అందరికి మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Spirit Movie Updates: సందీప్ రెడ్డి వంగ రెబెల్ స్టార్ ప్రభాస్.. రాబోయే ఓ సెన్సేషన్. ఈ సినిమా గురించి రోజు రోజుకి వినిపిస్తున్న వార్తలు అంచనాలను మరింత బలంగా పెంచేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాలో పూరి కూడా భాగం కాబోతున్నాడనే వార్తా అందరికి మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Nov 06, 2024 | 1:08 PMUpdated Nov 06, 2024 | 1:08 PM
సందీప్ రెడ్డి వంగ సినిమాకు పూరి డైలాగులు..?

సందీప్ రెడ్డి వంగా కేక పుట్టించే డైరెక్షన్ కు.. రెబలోడి యాక్టింగ్ కి.. డైలాగ్ కింగ్ పూరి మాటలు జోడిస్తే .. ఎలా ఉంటుంది? అబ్బో ఊహిస్తేనే విజువల్ అదిరిపోతుంది కదా. ఒకవేళ అదే ఊహ నిజమైతే ఆడియన్స్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అసలు ఇప్పుడు సడెన్ గా సందీప్ సినిమాలోకి పూరి ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తున్నారా. మరి సందీప్ రెడ్డి వంగా ప్లానింగ్ అలాంటిది. సినిమా మొత్తం సర్ప్రైజ్ లతో నింపేస్తాడు. ఇప్పుడు స్పిరిట్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా భాగం కాబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. సందీప్ రెడ్డి కూడా ఆ ఛాన్స్ తీసుకోడానికి ఎదురుచూస్తున్నాడట. ఇప్పటికే సందీప్ సినిమా కథను రెడీ చేసుకుని పట్టాలెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభాస్ మిగిలిన సినిమాల షూట్ లో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఈ లోపు ఆ కథకు తుది మెరుపులు దిద్దే పనిలో ఉన్నాడు సందీప్.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో డైలాగ్స్ బాధ్యతను.. డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు అప్పగించినట్లు సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది. సందీప్ ఏ స్వయంగా డైలాగ్స్ రాయమని కోరాడట. దానికి పూరి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. కానీ.. పూరి ఎస్ చెప్పడం వెనుక కారణం లేకపోలేదు. గతంలో ప్రభాస్ , పూరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి తెలియంది కాదు. ఇదొక కారణం అయితే.. సందీప్ కథకు డైలాగ్స్ రాస్తే దానికి వచ్చే రీచ్.. ఇంకా పెరుగుతుంది. ఇక అటు ప్రభాస్ కూడా పూరి డైలాగ్స్ కు పిచ్చ ఫ్యాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో స్పిరిట్ కు పూరి డైలాగ్స్ రాస్తే డార్లింగ్ కు సినిమా ఇంకాస్త ఈజీ అయిపోతుంది. ఒకవేళ ఈ టాక్ కనుక నిజమైతే.. సినిమాపై ఇప్పటివరకు ఉన్న హైప్ ఇంకాస్త పెరుగుతుంది.

సినిమా ఇంకా స్టార్ట్ చేయకముందే.. రోజు రోజుకి పెరుగుతున్న హైప్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. సందీప్ కథలకు గత కొంత కాలం నుంచి ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ప్రభాస్ కోసం దర్శకులు వెయిట్ చేస్తుంటే.. సందీప్ కోసం అటు హీరోలు వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరూ మాత్రం స్పిరిట్ ను స్లో పాయిజన్ లా ఆడియన్స్ కు ఎక్కించే పనిలో ఉన్నారు. రోజు రోజుకి సినిమా గురించి వినిపిస్తున్న ఒక్కో అప్డేట్.. సినిమాపై ఇంకాస్త క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఇవన్నీ కేవలం సినీ సర్కిల్ నుంచి వినిపిస్తున్న వార్తలు మాత్రమే. ఇక అసలైన అఫీషియల్ అప్డేట్స్ వస్తే మాత్రం.. ఆ హైప్ కు ఆడియన్స్ అంత పిచ్చెక్కిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet Girişcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş