iDreamPost
android-app
ios-app

58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ సింగర్ మూసేవాలా తల్లి!

  • Published Mar 17, 2024 | 11:22 AM Updated Updated Mar 17, 2024 | 11:22 AM

దివంగత ప్రముఖ పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. సిద్దూ తల్లి చరణ్ సింగ్ ఓ మగబిడ్డకు జన్మినిచ్చారు.

దివంగత ప్రముఖ పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. సిద్దూ తల్లి చరణ్ సింగ్ ఓ మగబిడ్డకు జన్మినిచ్చారు.

58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ సింగర్ మూసేవాలా తల్లి!

పంజాబ్ ర్యాపర్, దివంగత సింగర్ సిద్దూ మూసేవాలాను 2022లో దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఒక్కగానొక్క కొడుకు లేడు అన్న నిజాన్ని మూసేవాలా తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. దాంతో తన కొడుకును మళ్లీ చూసుకోవాలని భావించి 58 ఏళ్ల వయసులో తల్లికావడానికి సిద్దపడింది మూసేవాలా తల్లి చరణ్ సింగ్. ఐవీఎఫ్ ద్వారా ఆమె మళ్లీ గర్భం దాల్చిందని గతంలో వార్తలు వెలువడ్డాయి. కానీ.. ఈ న్యూస్ ను సిద్దూ తండ్రి, ఆమె భర్త బల్కౌర్ సింగ్ అవన్నీ పుకార్లే అని, వాటిని నమ్మోద్దని చెప్పాడు. కానీ తాజాగా సిద్దూ తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దివంగత ప్రముఖ పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. సిద్దూ తల్లి చరణ్ సింగ్ ఓ మగబిడ్డకు జన్మినిచ్చారు. ఇందుకు సంబంధించి బల్కౌర్ సింగ్ ఓ బాబును ఎత్తుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటో కింద ఈ విధంగా రాసుకొచ్చాడు..”శుభ్ దీప్(సిద్దూ మూసేవాలా అసలు పేరు)కు మీరు అందించిన ఆశీస్సులతో అతడికి ఓ తమ్ముడు జన్మించాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మీ ప్రేమకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చాడు.

ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారడంతో.. సిద్దూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిద్దూ మళ్లీ పుట్టాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మూసేవాలా లైఫ్ స్టోరీ ఆధారంగా జుపిందర్ సింగ్ అనే వ్యక్తి ఓ పుస్తకాన్ని రాశాడు. దాని పేరు ‘హూ కిల్డ్ మూసేవాలా? ది స్పైరలింగ్ స్టోరీ ఆఫ్ వాయలెన్స్ పంజాబ్’. 58 సంవత్సరాల వయసులో తన కొడుకును మళ్లీ చూసుకోవాలనే ఆశతో బిడ్డకు జన్మనిచ్చిన మూసేవాలా తల్లిదండ్రులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Balkaur Singh (@sardarbalkaursidhu)

ఇదికూడా చదవండి: OTTలోకి వచ్చేసిన హనుమాన్.. నిరాశలో తెలుగు ఫ్యాన్స్

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş