iDreamPost
android-app
ios-app

హీరో చాన్స్‌ కొట్టేసిన పబ్లిక్‌ టాక్‌ లక్ష్మణ్‌ .. ఆ బ్యూటీతో కలిసి!

  • Published Jun 19, 2023 | 6:17 PM Updated Updated Jun 19, 2023 | 6:17 PM
  • Published Jun 19, 2023 | 6:17 PMUpdated Jun 19, 2023 | 6:17 PM
హీరో చాన్స్‌ కొట్టేసిన పబ్లిక్‌ టాక్‌ లక్ష్మణ్‌ .. ఆ బ్యూటీతో కలిసి!

సినిమా విడుదల అయ్యిందంటే.. చాలు చాలా మంది రివ్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాధారణంగా సినిమా జర్నలిస్ట్‌లు రివ్యూ రాస్తుంటారు. కొన్ని సార్లు సినిమా విడుదల కన్నా ముందే ప్రివ్యూలు వేసి రివ్యూలు రాయిస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు రివ్యూలు చెప్పే విధానం కూడా మారుతుంది. నేటి కాలంలో పేపర్లు, సైట్లలో వచ్చిన రివ్యూల కన్నా.. థియేటర్‌ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు చెప్పే రివ్యూలపై జనాలకు నమ్మకం పెరిగింది. ఈమధ్య కాలంలో చిన్నాచితక చానెల్స్‌, యూట్యూబ్‌ చానెల్స్‌.. థియేటర్ల వద్దకు వెళ్లి ప్రేక్షకుల చేత రివ్యూలు చెప్పిస్తున్నాయి. ఇలాంటి రివ్యూల గురించి తలచుకోగానే.. మనకు గుర్తుకు వచ్చేది లక్ష్మణ్‌. బ్రో నీ మీద ఒట్టు.. ఈ సినిమా హిట్టు.. అంటూ తనదైన శైలీలో సినిమా రివ్యూ చెప్పి.. పబ్లిక్‌ టాక్‌ లక్ష్మణ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కొత్త సినిమా విడుదలైన ప్రతి సారి.. థియేటర్‌ వద్ద సందడి చేస్తూ.. తనదైన శైలీలో రివ్యూలు ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మణ్‌.. ఇప్పుడు ఏకంగా హీరో చాన్స్‌ కొట్టేశాడు. ఏంటి నమ్మడం లేదా.. నిజమండి బాబు.. కాకపోతే తను హీరో అయ్యింది సినిమాలో కాదు.. సీరియల్‌లో. జెమినీ టీవీలో ‘అర్ధాంగి’ అని సీరియల్ మొదలైంది. ఇందులో హరిత లాంటి సీనియర్ నటీనటులు ఎంతోమంది ఉన్నారు. ఈ  సీరియల్‌లో  లక్ష్మణ్‌ హీరోగా నటిస్తున్నాడు. తక్కువ కాలంలోనే ఈ సీరియల్‌ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.

ఇక ఈ సీరియల్‌లో అమాయకత్వంగా సాగే ఈ హీరో పాత్రలో లక్ష్మణ్ యాక్టింగ్‌ సూపర్‌ అంటున్నారు ప్రేక్షకులు. అటు కామెడీ, ఇటు యాక్టింగ్‌తో కెరీర్‌లో రాణించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే థియేటర్ల దగ్గర హంగామా సృష్టించే లక్ష్మణ్ ఇలా సైలెంట్‌గా హీరో అయిపోవడంతో ఆడియన్స్ షాకవుతున్నారు. కానీ నీ కెరీర్‌ విజయవంతంగా సాగాలి అని కామెంట్స్‌ చేస్తున్నారు.

రీతూతో కలిసి..

ఇక ఈ సీరియల్‌లో జబర్దస్త్ రీతూ చౌదరి కూడా సందడి చేస్తుంది. ఓ స్పెషల్ పాత్రలో రీతూ ఈ మధ్యే సీరియల్‌లో జాయిన్ అయింది. తాజాగా లక్ష్మణ్‌తో కలిసి చేసిన రీల్స్ కొన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది రీతు. ఈ భామ జబర్దస్త్‌లో ఒకప్పుడు ఆది టీమ్‌లో చేసేది. ప్రస్తుతం అప్పుడప్పుడూ స్పెషల్ షోస్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా సీరియల్‌లో అడుగుపెట్టింది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 8.30 గంటలకు జెమినీ టీవీలో ప్రసారమవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by lakshman tekumudi (@lakshman_tekumudi_broo)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet