iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఇంట తీవ్ర విషాదం!

  • Author Soma Sekhar Published - 11:15 AM, Sat - 1 July 23
  • Author Soma Sekhar Published - 11:15 AM, Sat - 1 July 23
ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఇంట తీవ్ర విషాదం!

సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే.. ప్రముఖ రైటర్ కొడుకు మరణించడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దాంతో కుటుంబం మెుత్తం శోకసంద్రలో మునిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు టీజీ విశ్వప్రసాద్.

టీజీ విశ్వప్రసాద్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థను వివేక్ కూచిభొట్లతో కలిసి స్థాపించారు. నిర్మాణ రంగంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి.. తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. కార్తికేయ 2, ధమాకా లాంటి సూపర్ హిట్ చిత్రాలను రీసెంట్ గా అందించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా టీజీ విశ్వప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి గీతాంజలి(70) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె పలు అనారోగ్యకారణాలతో బాధపడుతున్నారు. దాంతో ఆమెకు బెంగళూరులోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అయితే ఆమె ఆరోగ్యం కోలుకోలేని పరిస్థితుల కారణంగా.. ఆవిడ చివరి కోరిక మేరకు టీజీ విశ్వప్రసాద్ తల్లిని వారణాసి తీసుకెళ్లాడు. అక్కడే దైవదర్శనం అనంతరం ఆమె తుదిశ్వాస విడిచారు. ఇక గీతాంజలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో విశ్వప్రసాద్ పెద్దకొడుకు. ఇక ఆవిడ అంత్యక్రియలు వారణాసిలోనే జరుగుతాయని ఆయన తెలిపారు. దాంతో విశ్వప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు పలువురు సినీ ప్రముఖులు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabet