iDreamPost
android-app
ios-app

Naga Vamsi: గుంటూరు కారం కలెక్షన్స్ ఫేక్ అని ప్రూవ్ చేయండి: నిర్మాత నాగవంశీ

  • Published Jan 19, 2024 | 5:35 PM Updated Updated Jan 19, 2024 | 5:35 PM

గుంటూరు కారం మూవీ సాధించిన కలెక్షన్లు ఫేక్ అంటూ వస్తున్న వార్తలపూ ఘాటుగా స్పందించారు నిర్మాత నాగవంశీ. ఇవి ఫేక్ కలెక్షన్లు అంటున్నారుగా వాటిని మీరు ప్రూవ్ చేయాలంటూ సవాల్ విసిరారు.

గుంటూరు కారం మూవీ సాధించిన కలెక్షన్లు ఫేక్ అంటూ వస్తున్న వార్తలపూ ఘాటుగా స్పందించారు నిర్మాత నాగవంశీ. ఇవి ఫేక్ కలెక్షన్లు అంటున్నారుగా వాటిని మీరు ప్రూవ్ చేయాలంటూ సవాల్ విసిరారు.

  • Published Jan 19, 2024 | 5:35 PMUpdated Jan 19, 2024 | 5:35 PM
Naga Vamsi: గుంటూరు కారం కలెక్షన్స్ ఫేక్ అని ప్రూవ్ చేయండి: నిర్మాత నాగవంశీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలి రోజు డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ వసూళ్ల పరంగా మాత్రం ఎక్కడా తగ్గలేదు. మహేష్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి రుజువుచేసుకున్నాడు. గుంటూరు కారం విడుదలై వారం అవుతోంది. ఈ వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 212 కోట్లను కొల్లగొట్టింది. ఇక మూవీ రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతున్న సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టారు నిర్మాత నాగవంశీ. ఈ ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర ప్రశ్నలకు అంతే ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్స్ ఇచ్చారు. గుంటూరు కారం మూవీ సాధించిన కలెక్షన్స్ ఫేక్ అంటూ వచ్చిన కామెంట్స్ పై కూడా స్పందించారు నాగవంశీ.

గుంటూరు కారం విడుదలై వారం రోజులు అవుతున్న సందర్భంగా చిత్ర నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో మూవీ రివ్యూల మీద, కలెక్షన్లపై ఓపెన్ అయ్యారు. రివ్యూలపై, ఫేక్ కలెక్షన్లు అంటూ వచ్చిన వార్తలపై ఈ స్టార్ ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్లలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు మహేష్. అయితే ఈ కలెక్షన్లు ఫేక్ అంటూ కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఇదే ప్రశ్నకు ప్రెస్ మీట్ లో స్పష్టమైన సమాధానం ఇచ్చారు నిర్మాత నాగవంశీ. మీరు ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు కదా వాటిని ప్రూవ్ చేయండి. అంటూ కౌంటర్ ఇచ్చారు.

Prove that fake collections

ఇక ఒక సినిమాను చంపేయాలన్నా.. నిలబెట్టాలన్నా అది జనం చేతుల్లోనే ఉందని  నిర్మాత నాగవంశీ తెలిపారు. యూఎస్ లో కలెక్షన్లు తగ్గడం వెనక రీజన్ చెప్పారు. యూఎస్ లో ప్రేక్షకులు మహేష్ బాబు నుంచి ఒక విధమైనది మూవీ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మేం తీసింది ఒక విధమైన సినిమా. దీంతో వారి అంచనాలను అందుకోలేక యూఎస్ లో కలెక్షన్లు తగ్గాయి అంటూ నాగవంశీ పేర్కొన్నారు. ఒక జానర్ లో తీసిన మూవీ అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించాలని లేదని ఈ సందర్భంగా అన్నారు. ప్రొడ్యూసర్ ఇచ్చే కలెక్షన్లు నమ్మెుద్దు అని చెప్పిన నేనే ఈ సినిమా కలెక్షన్లు ఫేక్ అని ప్రూవ్ చేయమంటున్నాను అని సవాల్ విసిరారు. మరి నిర్మాత నాగవంశీ చేసిన సవాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetlist girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş