iDreamPost
android-app
ios-app

అందరూ వైష్ణవిని తిడుతున్నారు.. ప్లీజ్ తిట్టకండి: నిర్మాత

అందరూ వైష్ణవిని తిడుతున్నారు.. ప్లీజ్ తిట్టకండి: నిర్మాత

ప్రస్తుతం తెలుగు యువత ఒక సినిమా పేరుని తెగ స్మరిస్తున్నారు. అదే ఆనద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య- విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన బేబి. ఈ సినిమా హిట్ టాక్ దూసుకుపోతోంది. వెబ్ సిరీస్ లు, రీల్స్, యూట్యూబ్ వీడియోస్ తో పాపులర్ అయిన వేష్ణవి చైతన్య ఈ సినిమాతో హీరోయిన్ అయిపోయింది. అంతేకాకుండా తన నటనతో కుర్రాళ్లను తెగ మెప్పించేసింది. ఎంతగా అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు వైష్ణవిని తెగ తిట్టేస్తున్నారు. చివరికి నిర్మాత ఎస్కేఎన్ వైష్ణవిని తిట్టకండి అంటూ ప్రేక్షకులకు రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాడు.

బేబి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. యువత ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. చిత్ర బృందం తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు థాంక్స్ మీట్ కూడా పెట్టింది. ఆ మీట్ లో చిత్ర నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. “బేబి సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అంతా ఏడుస్తూ బయటకు వస్తున్నారు. సినిమా కొనుగోలు చేసిన బయ్యర్లు నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. ఈ సినిమా లెంగ్స్ ఎక్కువ ఉందని మొదట మేం భావించాం. కానీ, ప్రేక్షకులు ఆ విషయాన్ని పక్కన పెట్టి కథలో ఉన్న బలాన్ని చూశారు. ఈ కథలో ఉన్న పాత్రల ఎమోషన్స్ అర్థం అయ్యేలా చెప్పాలనే డైరెక్టర్ సాయి రాజేశ్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anand Deverakonda (@ananddeverakonda)

ఆనంద్- వైష్ణవి- విరాజ్ ఈ మూవీకి కమిట్ అయ్యి ఉన్నారు. వాళ్లు ఈ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయలేదు. వైష్ణవి చాలా మంచి అమ్మాయి. క్యారెక్టర్ కోసం మాత్రమే ఆమె అలా నటించింది. సినిమా చూసిన వాళ్లంతా వైష్ణవిని తిడుతున్నారు. నిజానికి ప్రేక్షకులు వైష్ణవిని తిడుతున్నారు అంటే సినిమా వారికి కనెక్ట్ అయ్యిందని అర్థం. కాబట్టి అలాంటి పట్టించుకోవద్దని వారికి చెప్పాను. ఈ సినిమా కోసం వైష్ణవి చైతన్య రెండేళ్లు కష్టపడింది. ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ. కానీ, సినిమా మీద ప్యాషన్ తో ఆమె ఈ పాత్ర చేసింది” నిర్మాత ఎస్కేఎన్ వ్యాఖ్యానించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆనంద్ దేవరకొండలో తమని తాము ఊహించేసుకుంటున్నారు అంట. అందుకే వైష్ణవి తమనే మోసం చేసిందనే ఫీలింగ్ తో పాపం ఆమెను తిట్టేస్తున్నారు అంట.

 

View this post on Instagram

 

A post shared by Anand Deverakonda (@ananddeverakonda)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş