iDreamPost
android-app
ios-app

హీరో సుదీప్‌పై సంచలన ఆరోపణలు చేసిన నిర్మాత రెహమాన్‌!

  • Published Jul 10, 2023 | 6:16 PM Updated Updated Jul 10, 2023 | 6:16 PM
  • Published Jul 10, 2023 | 6:16 PMUpdated Jul 10, 2023 | 6:16 PM
హీరో సుదీప్‌పై సంచలన ఆరోపణలు చేసిన నిర్మాత రెహమాన్‌!

ప్రముఖ సీనియర్‌ కన్నడ నిర్మాత రెహమాన్‌.. స్టార్‌ హీరో కిచ్చ సుదీప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సుదీప్‌ కారణంగా తాను లక్షల రూపాయలు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను సుదీప్‌ ఆదుకోవాలంటూ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఆ ప్రెస్‌ మీట్‌లో రెహమాన్‌ మాట్లాడుతూ.. ‘‘ నేను ఇప్పటివరకు 20 సినిమాలు చేశాను. విష్ణువర్థన్‌తో యజమాన, సుదీప్‌తో హుచ్చ అనే సినిమాలు చేశాను. నేను సుదీప్‌ మీద ఆరోపణలు చేయటం లేదు.

ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఇప్పుడు పెద్ద స్టార్‌. ఆయన మీద ఆరోపణలు చేయటం మంచిది కాదు. నేను గతంలో సుదీప్‌కు ఓ సినిమా కోసం 35 లక్షల రూపాయలు ఇచ్చాను. ఆ డబ్బులకోసం నేను ఇప్పటి వరకు 100 సార్లు సుదీప్‌ ఇంటికి వెళ్లాను. అయితే, నేను ఇంటికి వెళ్లిన ప్రతీసారి ఆయన లేడు అంటూ వెనక్కు పంపుతున్నారు. ఓ రోజు ఆయన ఉన్నాడని తెలిసి ఇంటికి వెళ్లాను. అక్కడ నన్ను ఫ్యాన్స్‌తో పాటు కూర్చోబెట్టారు. ప్రొడ్యూసర్లను పై ఫ్లోర్‌లో కూర్చోబెట్టారు. సుదీప్‌కు 1350 సార్లు ఫోన్‌ చేశాను. కాల్‌ కట్‌ చేస్తున్నారు.

నూరు సార్లకు పైగా డబ్బులు ఇవ్వమని అడిగాను. కానీ, డబ్బులు తిరిగి ఇవ్వటం లేదు. నా డబ్బు నాకు ఇస్తే చాలు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెహమాన్‌.. సుదీప్‌పై చేసిన ఆరోపణలు కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ ఆరోపణలపై సుదీప్‌ ఇంకా స్పందించలేదు. కానీ, మరో నిర్మాత ఎమ్‌ ఎన్‌ కుమార్‌ చేసిన ఆరోపణలపై కిచ్చ సుదీప్‌ ఓ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో తనపై చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. మరి, నిర్మాత రెహమాన్‌.. సుదీప్‌పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి: ధనుష్‌, ఐశ్వర్యలకు తీపి కబురు చెప్పిన హైకోర్టు!

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş