iDreamPost
android-app
ios-app

ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్‌ అరెస్ట్‌!

  • Published Sep 08, 2023 | 12:35 PM Updated Updated Sep 08, 2023 | 12:35 PM
  • Published Sep 08, 2023 | 12:35 PMUpdated Sep 08, 2023 | 12:35 PM
ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్‌ అరెస్ట్‌!

ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్‌ చంద్రశేఖర్‌, నటి మహాలక్ష్మిల జంట గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వీరి పెళ్లి ఓ సంవత్సరం క్రితం దేశ వ్యాప్తంగా ఓ చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో అన్ని మీడియాల్లో వీరిపై వార్తలు వచ్చాయి. తర్వాత వీరిద్దరూ గొడవలు పడి విడిపోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. అవన్నీ పుకార్లు మాత్రమేనని తేలింది. అయితే, పెళ్లి తర్వాతినుంచి రవీందర్‌ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కొన్ని నెలల క్రితం చీటింగ్‌ కేసు నమోదైంది.

రవీందర్‌ తన దగ్గరినుంచి 16 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశాడంటూ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తి సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫేక్‌ డాక్యుమెంట్లు క్రియేట్‌ చేసి.. తనతో బిజినెస్‌ ఒప్పందం చేసుకుని మోసం చేశాడని బాలాజీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో రవీందర్‌ మోసానికి పాల్పడినట్లు తేలింది. దీంతో ఆయన్ని తాజాగా అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం రవీందర్‌నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

బాధితుడు బాలాజీతో పాటు మరికొందరిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఇక, రవీందర్‌ అరెస్ట్‌ తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. కాగా, కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న రవీందర్‌, మహాలక్ష్మిల జంట 2022లో పెళ్లి బంధంతో ఒక్కటయింది. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. భాగస్వాములతో విడిపోయి వేరుగా ఉంటున్న వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన సంవత్సరంలోనే రవీందర్ ఇలా అరెస్ట్‌ అవ్వటం గమనార్హం. మరి, రవీందర్‌ చంద్రశేఖర్‌ అరెస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabet