iDreamPost
android-app
ios-app

‘గుంటూరు కారం’ హైలెట్స్‌ లీక్‌ చేసిన నిర్మాత నాగవంశీ!

  • Published Jan 03, 2024 | 12:36 PM Updated Updated Jan 03, 2024 | 12:36 PM

త్రివిక్రమ్‌-మహేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావటంతో ‘గుంటూరు కారం’పై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్రివిక్రమ్‌-మహేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావటంతో ‘గుంటూరు కారం’పై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Published Jan 03, 2024 | 12:36 PMUpdated Jan 03, 2024 | 12:36 PM
‘గుంటూరు కారం’ హైలెట్స్‌ లీక్‌ చేసిన నిర్మాత నాగవంశీ!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ గుంటూరు కారం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12వ తేదీనుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీపై మొదటినుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్‌డేట్‌కు మంచి స్పందన వస్తూ ఉంది. ఇక, గుంటూరు కారం నుంచి వచ్చిన పాటలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి.

మొన్న ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ కుడ్చీ మడత పెట్టి’ పాట కూడా ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. గుంటూరు కారం విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. తాజాగా, మహేష్‌ బాబు ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ అయ్యారు. దాదాపు 14 నిమిషాలకు పైగా వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా గుంటూరు కారం సినిమాలోని కొన్ని హైలెట్స్‌ను లీక్‌ చేశారు. సినిమా క్లైమాక్స్‌లో 45 నిమిషాలు అద్బుతంగా ఉంటుందని అన్నారు.

ఫ్యాన్స్‌తో ఆయన మాట్లాడుతూ.. మహేష్‌ బాబుతో చాలా ఏళ్ల నుంచి సినిమా చేయడం కోసం చూస్తున్నానని అన్నారు. గుంటూరు కారంతో ఆ కల నెరవేరిందని పేర్కొన్నారు. సినిమా చివరి 45 నిమిషాలు ఫైట్ సీక్వెన్స్‌లు, భావోద్వేగాలు, కుర్చీ మడతపెట్టి పాటలతో అద్భుతంగా ఉంటుందని అన్నారు. గుంటూరు కారంతో భారీ హిట్‌ సాధిస్తున్నాని ధీమా వ్యక్తం చేశారు. థియేటర్ల సంగతి తాను చూసుకుంటానని అన్నారు. సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడం అభిమానుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

కాగా, గుంటూరు కారం సినిమా నుంచి కొద్దిరోజుల క్రితం ‘కుర్చీ మడత పెట్టి’ అనే పాట వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాట సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చినా.. అదే సమయంలో వివాదాల్లోకి కూడా వెళ్లింది. స్టార్‌ హీరో సినిమాలో అలాంటి పాట ఎందుకూ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. దీనికి ధీటుగా మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ సమాధానం ఇస్తూ ఉన్నారు. ఆ పాటతో మీకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇక, గుంటూరు కారం సినిమాకు ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. మహేష్‌ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ  మూవీ ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ కూడా నాగవంశీ ఇచ్చేశారు. జనవరి 6వ తేదీన ట్రైలర్‌ విడుదల కానుందని ఆయన తెలిపారు. మరి, గుంటూరు కారం నిర్మాత నాగవంశీ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఈ లీకులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoney girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş