iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. రిమాండ్ లో సంచలన నిజాలు బయటపెట్టిన కేపీ చౌదరి! లిస్ట్ లో సినీ స్టార్స్..

  • Author Soma Sekhar Published - 11:29 AM, Sat - 24 June 23
  • Author Soma Sekhar Published - 11:29 AM, Sat - 24 June 23
టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. రిమాండ్ లో సంచలన నిజాలు బయటపెట్టిన కేపీ చౌదరి! లిస్ట్ లో సినీ స్టార్స్..

ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ తో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డ్రగ్స్ కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి.. అతడి నుంచి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. దాంతో గతంలో టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ కేసుతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే కేపీ చౌదరిని రిమాండ్ లో పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. కేపీ చౌదరీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ తారలతో వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు ధృవీకరించారు. ఇక ఈ కేసులో బిగ్ బాస్ బ్యూటీతో పాటు ఇద్దరు సీనియర్ నటీమణులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కేపీ చౌదరి.. ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న పేరు. ఈ నెల 14న డ్రగ్స్ కేసులో నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కేపీ చౌదరి కొనసాగించిన కోకైన్ దందా.. వాటిని కోనుగోలు చేస్తున్న వారి పేర్లను పోలీసులు సేకరించారు. పోలీసుల రిమాండ్ లో ఉన్న ఆయన పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేపీ చౌదరి నుండి కొకైన్ కొనుగోలు చేసిన వారి జాబితా ఓ పెన్ డ్రైవ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కాగా.. వారి వివరాలు ఫొటోలతో సహా బయటపడినట్లు సమాచారం. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 మంది టీవీ, సినీ నటులు , మోడల్స్ ఉన్నారు. వీరిలో ఓ బిగ్ బాస్ బ్యూటీ, ఇద్దరు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారితో కేపీ చౌదరి వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు ఆధారాలు కనుగొన్నారు. అదీకాక అతడి బ్యాంక్ ఖాతాల్లోంచి రూ. లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు నిర్దారించారు. కాగా వీరితో పాటుగా ఇద్దరు దర్శకులు, కొందరు రాజకీయ ప్రముఖులు కూడా కేపీ చౌదరి లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇంకెవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş