iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తు పట్టారా.. ఒకప్పుడు బాత్రూమ్‌లో భోజనం.. మరి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌!

  • Published Jul 20, 2023 | 2:42 PM Updated Updated Jul 20, 2023 | 2:42 PM
  • Published Jul 20, 2023 | 2:42 PMUpdated Jul 20, 2023 | 2:42 PM
ఈ చిన్నారిని గుర్తు పట్టారా.. ఒకప్పుడు బాత్రూమ్‌లో భోజనం.. మరి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌!

ఇక్కడ ఊయలలో పడుకుని.. అమాయకమైన చూపులతో.. క్యూట్‌ లుక్స్‌తో ముద్దొస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. లేదా. ఈ బుజ్జి పాప ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టింది. ఇప్పుడంటే లగ్జరీ లైఫ్‌ అనుభవిస్తోంది కానీ.. ఒకప్పుడు బంకర్‌లో జీవించేది. ఇంట్లో అనేక ఆంక్షలు.. నచ్చిన దుస్తులు కూడా వేసుకోవడానికి కూడా లేదు. చదువుకునే రోజుల్లో జాతి వివక్ష ఎదురు చూసింది. తోటివాళ్ల అవమానాలు తట్టుకోలేక.. బాత్రూమ్‌లో కూర్చొని భోజనం చేసేది. అన్ని అవమానాలు ఎదుర్కొన్న ఆ యువతి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మరి ఇప్పటికైనా ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా లేదా.. అయితే చదవండి

పైన ఫొటోలోని చిన్నారి ఎవరంటే.. ప్రియాంక చోప్రా. పీసీ తండ్రి ఆర్మీ అధికారి కావడంతో ఇంట్లో అనేక ఆంక్షలు. విదేశాల్లో చదువుకోడానికి వెళ్తే.. అక్కడ జాతి వివక్ష, అవమానాలు. ఎవరు మాట్లాడేవారు కాదు. వాటన్నింటిని దాటుకుని.. గ్లామర్‌ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకుంది. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ అక్కడి రాజకీయాలు తట్టుకోలేక.. హాలీవుడ్‌ బాట పట్టింది. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి ఆత్మకథ అన్‌ఫినిష్డ్‌లో చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.

ప్రియాంక తల్లిదండ్రులు ఆర్మీ వైద్యులు. తరచుగా ట్రాన్స్‌ఫర్‌లు జరుగుతుండేవి. ఒకసారి లేహ్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. అప్పుడు ప్రియాంక కుటుంబం బంకర్‌లో నివసించేది. ఈ క్రమంలో 13 ఏళ్ల వయసులో ప్రియాంక చదువుకోవడానికి అమెరికా వెళ్లింది. అక్కడ జాతి వివక్ష ఎదురైంది. స్నేహితులు ఎవరు ఉండేవారు కారు. వారు చేసే అవమానాలు తట్టుకోలేక బాత్రూమ్‌లో భోజనం చేసేది. ఇక అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రియాంక కట్టు,బొట్టు మారింది. అది ఆమె తండ్రికి ఏమాత్రం నచ్చలేదు. ఆంక్షలు విధించేవాడు. బయట అడుగుపెట్టనిచ్చేవాడు కాదు. కానీ ఇవేవి ఆమె ప్రతిభను అడ్డుకోలేకపోయాయి. 18 ఏళ్ల వయసులో మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ప్రియాంకకు సినిమా అవకాశాలు మాత్రం అంత ఈజీగా రాలేదు. ఛాన్స్‌ల కోసం వెళ్తే దర్శకనిర్మాతలు చెత్త సలహాలు ఇచ్చేవారు. సినిమాల్లోకి రాకముందు ఓ డైరెక్ట్‌ అయితే ఏకంగా ప్రియాంక ఛాతీ, దవడ, బ్యాక్‌లకు సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చాడట. వాటన్నింటిని దాటుకుని.. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత హాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఇక ఈ భామ తెలుగులో రామ్‌ చరణ్‌తో కలిసి తుపాకీ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş