iDreamPost
android-app
ios-app

Priyanka Chopra: ప్రియాంక చోప్రా మెడలో స్నేక్ నెక్లెస్.. ఇది కదా వెరైటీ అంటే!

  • Published Mar 15, 2024 | 4:20 PM Updated Updated Mar 15, 2024 | 4:20 PM

బాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీ తాజాగా ఓ ఈవెంట్ కోసం ముంబైలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్.. సోషల్ మీడియాలో షేర్లు, కామెంట్స్ తో తెగ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీ తాజాగా ఓ ఈవెంట్ కోసం ముంబైలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్.. సోషల్ మీడియాలో షేర్లు, కామెంట్స్ తో తెగ వైరల్ అవుతున్నాయి.

  • Published Mar 15, 2024 | 4:20 PMUpdated Mar 15, 2024 | 4:20 PM
Priyanka Chopra: ప్రియాంక చోప్రా మెడలో స్నేక్ నెక్లెస్.. ఇది కదా వెరైటీ అంటే!

ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత ముంబైకి వచ్చింది. ఆమె రాకతో ఒక్కసారిగా కెమెరాల కళ్లన్నీ ఆమెపై పడ్డాయి. స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అంతా తన వెంటపడి మరి ఫొటోస్ తీసుకున్నారు. చాలా కాలానికి ప్రియాంక చోప్రా కనిపించడంతో.. ఆమె లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పైగా.. ఆమె అందం అప్పటికి ఇప్పటికి ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. లేటెస్ట్ గా ప్రియాంక చోప్రా సిల్క్ ప్యాంట్, దానికి కాంబినేష‌న్ గా స్టైలిష్ వైట్ క్రాప్ టాప్ తో.. మెడలో స్నేక్ చోకర్ తో .. డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. దాదాపు సంవత్సరం తర్వాత ప్రియాంక చోప్రా.. ఇండియాలో కనిపించింది. దీనితో ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో హిట్ మూవీస్ లో నటించి ఎందరో అభిమానులను తన సొంతం చేసుకుంది. అటు సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గానే ఉంటూ ఉంటుంది. అయితే, తాజాగా ప్రియాంక చోప్రా ముంబై కు వచ్చింది. ఇక ముంబైలో దర్శనం ఇచ్చిన ప్రియాంక చోప్రా కెమెరా కళ్ళకు చిక్కింది. అవి కాస్త సోషల్ మీడియాలో నిమిషాల్లో షేర్స్ అవుతున్నాయి. ఇక సామజిక మాధ్యమాలలో ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ప్రియాంకను కామెంట్ల వర్షంతో ముంచేస్తున్నారు. ముఖ్యంగా అందరి కళ్ళు ప్రియాంక మెడలో ఉన్న.. స్నేక్ చోకర్ పైనే పడ్డాయి. ఒక పామును మెడ‌లో వేసి చుట్టేసిన‌ట్టుగా.. రియలిస్టిక్ గా ఆ చోకర్ కనిపించడంతో.. నెటిజన్లు దానిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆ చోకర్ గురించి కూడా ‘ఆ నెక్లెస్.. బుస్ బుస్ స్నేక్ బాబోయ్!’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Priyanka chopra

అయితే, ఈ భామ సడెన్ గా ముంబైలో ప్రత్యేక్షమవ్వడానికి కారణం.. బల్గారీ స్టోర్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్. ఈ సంస్థ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌లలో ప్రియాంక కూడా.. ఒకరు. ప్రియాంకతో పాటు అన్నే హాత్వే, జెండయా, లిసా లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. ఈ ఈవెంట్ కు అటెండ్ అవ్వడానికి మునుపే .. ప్రియాంక తన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో.. తానూ ఇండియాకు వెళ్తున్నట్లు ప్రకటించింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఏదేమైనా సామజిక మాధ్యమాలలో స్టార్ సెలెబ్రిటీల ఫోటోలు నిమిషాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫోటోలు కూడా.. వైరల్ అవుతూ ఉన్నాయి. మరి, ప్రియాంక లేటెస్ట్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet giriş