iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి.. నేడు రూ. 40 కోట్లు తీసుకుంటున్న స్టార్ హీరోయిన్!

  • Published Jul 17, 2024 | 3:51 PM Updated Updated Jul 17, 2024 | 3:51 PM

Priyanka Chopra: సాధారణంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మాత్రం భారీగా పారితోషకం తీసుకుంటారనే సంగతి తెలిసింది. కానీ వారి స్థాయిలో కూడా ఓ హీరోయిన్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Priyanka Chopra: సాధారణంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మాత్రం భారీగా పారితోషకం తీసుకుంటారనే సంగతి తెలిసింది. కానీ వారి స్థాయిలో కూడా ఓ హీరోయిన్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Jul 17, 2024 | 3:51 PMUpdated Jul 17, 2024 | 3:51 PM
ఈ చిన్నారి.. నేడు రూ. 40 కోట్లు తీసుకుంటున్న స్టార్ హీరోయిన్!

సినిమాలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు అందరూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో ఇటీవలే సెలబ్రిటీలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వారి ఫ్యాన్స్ చూసి.. తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల కాలేజీ డేస్, బాల్యానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అలానే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పై ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఆ పాప.. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఉంది. రూ.40 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి వెళ్లింది. మరి.. ఆ పాప ఎవరు, ఆ వివరాలు ఏమిటో  ఇప్పుడు చూద్దాం….

సాధారణంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మాత్రం భారీగా పారితోషకం తీసుకుంటారనే సంగతి తెలిసింది. సినిమా నిర్మాణంలో అయ్యే ఖర్చులో వీరి రెమ్యునరేషన్ శాతమే ఎక్కువ ఉంటుంది. అయితే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో చాలా తక్కువ మంది మాత్రమే హీరోయిన్లు ఉంటారు. అలానే ఓ ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా హీరోలతో సమానంగా పారితోషకం తీసుకుంటుంది. అంతేకాక బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కి వెళ్లింది. ఈ అమ్మడు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక్క సినిమాకు రూ. 40 కోట్లు వసూలు చేస్తుంది.  సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ అందరి కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆ అందాల రాశికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.

ఒకప్పుడు బాలీవుడ్ లో చక్రం తిప్పిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది ఆ బ్యూటీ ఎవరో అని. ఆమె ఇంకేవరో కాదు..హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం.. ప్రియాంక చోప్రా ఒక్క మూవీకి రూ.40 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అయితే ఈ రెమ్యునరేషన్ అనేది కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే తీసుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం హాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఒక్క మూవీకి 5 మిలియన్ డాలర్స్.. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.40 కోట్లు తీసుకుంటుందట.

ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సిటాడెల్ సిరీస్ కోసం ప్రియాంక భారీ పారితోషికాన్ని అందుకుంది. ఇక హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు హిందీలో ఒక్కొక్క మూవీకి రూ.14 నుంచి రూ.20 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది. బర్ఫీ, మేరీకోమ్, బాజీరావ్ మస్తానీ, దిల్ ధడక్నే దో వంటి బ్లాక్ బస్టర్ హిట్లను ఈఅమ్మడు తన ఖాతాలో వేసుకుంది. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో వివాహం తర్వాత లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యింది.  ప్రస్తుతం ఈ అమ్మడి చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş