iDreamPost
android-app
ios-app

165 కోట్ల విల్లాను ఖాళీ చేసిన ప్రియాంక జోడీ.. ఎందుకంటే?

  • Published Feb 01, 2024 | 5:32 PM Updated Updated Feb 01, 2024 | 5:43 PM

Priyanka Chopra- Nick Jonas: ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ జోడీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వారు ఎంతో ఇష్టపడి కొనుకున్న విల్లాను ఖాళీ చేశారు.

Priyanka Chopra- Nick Jonas: ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ జోడీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వారు ఎంతో ఇష్టపడి కొనుకున్న విల్లాను ఖాళీ చేశారు.

  • Published Feb 01, 2024 | 5:32 PMUpdated Feb 01, 2024 | 5:43 PM
165 కోట్ల విల్లాను ఖాళీ చేసిన ప్రియాంక జోడీ.. ఎందుకంటే?

ప్రియాంక చోప్రా తమిళ్ సినిమాతో కెరీర్ ప్రారంభించి.. బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగి.. ఇప్పుడు హాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. తనకంటే పదేళ్ల చిన్నవాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని వివాహం చేసుకుంది. ప్రియాంక చోప్రా ఎప్పుడూ తన మూవీస్ కి సంబంధించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలకు సంబంధించి కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ కి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఎంతో ఇష్టపడి కొనుకున్న విల్లాను వాళ్లు ఖాళీ చేశారంట. అందుకు బలమైన కారణే ఉందని చెబుతున్నారు.

ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ జంటకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానులు ఉన్నారు. అందుకే వారికి సంబంధించి.. మూవీ న్యూస్ అయినా వ్యక్తిగత విషయం అయినా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అలా ఇప్పుడు ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ జోడీ తమ విల్లాను ఖాళీ చేశారంట. ప్రియాంక- నిక్ అమెరికాలో సెటిల్ అయిన విషయం తెలిసిందే. వారి అభిరుచులకు తగ్గట్లుగా లాస్ ఏంజిలెస్ లో ఏకంగా 20 మిలియన్ డాలర్లు వెచ్చించి ఒక లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ వార్త విని వరల్డ్ వైడ్ గా ఉన్న సెలిబ్రిటీలు కూడా అవాక్ అయ్యారు.

తాజాగా ఈ విల్లాకు సంబంధించి వస్తున్న వార్త అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అంత ఇష్టపడి, కోట్లు ఖర్చుచేసిన కొనుగోలు చేసిన విల్లాను ప్రియాంక జోడీ ఖాళీ చేసిందంటూ స్థానిక మీడియా వార్తలు ప్రచురించింది. ఆ విల్లాలో నీళ్లు లీకవుతుండటంతో చాలా ప్లేసులు డ్యామేజ్ అయ్యాయంట. నీళ్లు లీక్ అవ్వడం వల్ల ఆ విల్లాలో ఉండే పరిస్థితి కూడా లేదంటూ విల్లాను ఖాళీ చేశారని వార్తలు వచ్చాయి. ఆ వాటర్ లీకులకు సంబంధించి మరమ్మతులు చేయాలంటే ఏకంగా 2.5 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అందుకే ప్రియాంక చోప్రా జోడీ విల్లాను ఖాళీ చేయడం మాత్రమే కాకుండా.. తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ విల్లా అమ్మిన వ్యక్తిపై కోర్టులో దావా కూడా వేశారంట.

ప్రస్తుతం మార్కెట్ వాల్యూ చూస్తే.. ఆ విల్లా ధర ఏకంగా రూ.165 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇంక ఆ విల్లా ప్రత్యేకతల విషయానికి వస్తే.. అందులో మొత్తం 7 బెడ్ రూమ్స్, 9 బాత్ రూమ్స్ ఉంటాయి. హోమ్ థియేటర్, చెఫ్ కిచెన్, స్పా, టెంపరేచర్ కంట్రోల్డ్ వైన్ సెల్లార్, బిలియర్డ్స్ రూమ్, పర్సనలైజ్డ్ జిమ్, స్టీమ్ షవర్ వంటి అధునాతన వసతులు ఉంటాయి. ఈ విల్లాని పిల్లలతో ఆనందంగా గడిపేందుకు కొనుగోలు చేశారు. వారితో గడిపే ప్రతిక్షణం అమూల్యమైనది కావాలని ప్రియాంక జోడీ కోరుకుంది. వారి అభిరుచికి తగినట్లు ఆ విల్లాలో మార్పులు చేర్పులు కూడా చేశారు. ఈ విల్లాలో పిల్లలో ఆడుకునేందుకు అవుట్ డోర్ స్పేస్, గ్రీనరీ ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. కానీ, చివరకు ఇలా అనుకోకుండా ఖాళీ చేయాల్సి వచ్చింది. మరి.. ఇష్టపడి కొనుగోలు చేసిన విల్లాను ప్రియాంక- నిక్ జోనస్ ఖాళీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom