iDreamPost
android-app
ios-app

యంగ్ హీరోతో లవ్! కన్ఫర్మ్ చేసిన ‘రానా నాయుడు’ బ్యూటీ!

  • Author ajaykrishna Published - 09:01 AM, Thu - 3 August 23
  • Author ajaykrishna Published - 09:01 AM, Thu - 3 August 23
యంగ్ హీరోతో లవ్! కన్ఫర్మ్ చేసిన ‘రానా నాయుడు’ బ్యూటీ!

ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ మధ్య ప్రేమకథల గురించి చాలా ఆసక్తి చూపిస్తుంటారు అభిమానులు. తమ అభిమాన హీరోలు, హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని వెయిట్ కూడా చేస్తుంటారు. ఇటీవల ఓ హీరోయిన్.. బాలీవుడ్ యంగ్ హీరోతో లవ్ లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. హీరోయిన్ ప్రియా బెనర్జీ గురించి వినే ఉంటారు. తెలుగులో పదేళ్ల క్రితం కిస్, జోరు, అసుర లాంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లి.. అక్కడే సెటిల్ అయిపోయింది. అయితే.. నాలుగేళ్లుగా సినిమాలైతే చేయట్లేదు. కానీ.. వెబ్ సిరీస్ లు మాత్రం ఒకదాని వెనుక మరోటి వెంటవెంటనే చేసేస్తోంది. ఈ మధ్య రానానాయుడు అనే బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.

ఇక ప్రియా బెనర్జీ ప్రస్తుతం.. తన కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా సంతోషంగా ఉందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. తన పర్సనల్ లైఫ్ గురించి, లవ్ గురించి ఓపెన్ అయ్యింది. ఈ సందర్బంగా తన లవర్, హీరో ప్రతీక్ బబ్బర్ గురించి మాట్లాడుతూ.. “ప్రతీక్, నేను మూడేళ్లుగా కలిసి ఉన్నాం. మా రిలేషన్ షిప్ పై పెద్దగా చర్చలు జరగకూడదని.. మేం బయటికి ప్రకటించలేదు. మేం ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజున అధికారికంగా మా లవ్ ని అనౌన్స్ చేశాం. మాకు అనవసరమైన ప్రచారం అవసరం లేదని భావించి ఊరుకున్నాం. ప్రతీక్, నేను ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టాం. తనకు వర్క్ పై శ్రద్ధ ఎక్కువ. నటుడుగా తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.” అని చెప్పింది.

అలాగే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ప్రతీక్ త్వ‌ర‌లోనే అనుకున్నది సాధిస్తాడని చూస్తున్నాం. మా పెళ్లి కూడా జరుగుతుంది. అది ఎప్పుడు అనేది మేం టైమ్ చూసుకొని ప్ర‌క‌టిస్తాం. ప్రెజెంట్ మేం రిలేష‌న్ షిప్ లో సీరియ‌స్ గా ఉన్నాం. కానీ.. ఈ ఏడాది మాత్రం పెళ్లి చేసుకోము” అని చెప్పేసింది ప్రియా. ఇదిలా ఉండగా.. ప్రియా కంటే ముందు ప్రతీక్.. గతంలో అమీ జాక్సన్ తో డేటింగ్ చేశాడని వార్తలొచ్చాయి. కానీ.. 2019లో ప్రొడ్యూసర్ సన్యా సాగర్ ని పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే.. వీరిద్దరూ ఓ ఏడాది తర్వాత విడిపోవడం జరిగింది. దీంతో ప్రతీక్ గతం గురించి అడిగిన ప్రశ్నకు.. తనకేం పట్టింపు లేదని తేల్చేసింది అమ్మడు. మొత్తానికి ప్రియా బెనర్జీ.. ప్రతీక్ తో సీరియస్ లవ్ లో ఉందన్నమాట అని నెటిజన్స్ అంటున్నారు. మరి సెలబ్రిటీల లవ్ స్టోరీస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş